బాబు-అఖిలప్రియలకు షాక్: దెబ్బకు దెబ్బ.. వైసిపిలో చేరిన టిడిపి నేత
నంద్యాల: ఉప ఎన్నికలకు ముందు నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. నంద్యాల టిడిపికి చెందిన మైనార్టీ వర్గం నేత రసూల్ ఆజాద్ వైసిపిలో చేరారు.
నంద్యాల: ఉప ఎన్నికలకు ముందు నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. నంద్యాల టిడిపికి చెందిన మైనార్టీ వర్గం నేత రసూల్ ఆజాద్ వైసిపిలో చేరారు.

శిల్పా సమక్షంలో వైసిపిలోకి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసిపిలో చేరారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు వైసిపిలో చేరారు. వారిని శిల్పా మోహన్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

కచ్చితంగా గెలుస్తాం
ఉప ఎన్నికల కారణంగానే చంద్రబాబు నియోజకవర్గంపై ప్రేమ చూపిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరిట రూ.కోట్లాది రూపాయల అంకెలగారడి చూపిస్తున్నారన్నారు. ఎన్నికల్లో కచ్చితంగా వైసిపి గెలుస్తుందన్నారు. టిడిపికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించిందన్నారు.

చంద్రబాబుకు శిల్పా షాక్
నంద్యాలలో టిడిపి గెలుపు బాధ్యతను చంద్రబాబు పలువురు నేతలపై పెట్టారు. అలాగే, ముస్లీంల ఓట్లు అన్ని టిడిపికి పడేలా ఇద్దరు నేతలకు బాధ్యతను అప్పగించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ నంద్యాలలో మరో కీలక నేతను వైసిపి లాక్కొని చంద్రబాబుకు షాకిచ్చింది.

టిడిపి వ్యాఖ్యలకు ధీటుగా..
శిల్పా మోహన్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు కొందరు ముస్లీంలపై తప్పుడు కేసులు పెట్టించారని, చట్టపరంగా వాటిపై సమస్య లేకుండా చూస్తామని చంద్రబాబు సహా టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తద్వారా మైనార్డీలు వైసిపి వెంట నడవవద్దని ప్రచారం చేస్తున్నారు. కానీ టిడిపి కీలక నేత వైసిపిలో చేరడం భూమా కుటుంబానికి మైనస్ అంటున్నారు.












Click it and Unblock the Notifications