అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నన్నపనేని రాజకుమారి: చినరాజప్ప పరామర్శ
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతోపాటు శ్వాసకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న నన్నపనేనిని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

వైద్యులు పరీక్షించి రెండు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని, ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. మంగళవారం ఎమ్మార్‌ఐ స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహించనున్నారని ఆమె వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు.
కాగా, విషయం తెలుసుకున్న హోంమంత్రి చినరాజప్ప మంగళవారం ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నన్నపనేని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు చినరాజప్ప.












Click it and Unblock the Notifications