గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇస్తారా: కేసీఆర్‌ను బుద్ధ విగ్రహం అడిగిన నన్నపనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: హైదరాబాద్‌లోని ట్యాంక్‌‌బండ్ పైన ఉన్న ఆంధ్రుల విగ్రహాలను తిరిగి ఆంధ్రాకు పంపుతానంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతల పైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి బుధవారం మండిపడ్డారు.

Nannapannni asks about Buddha statue and Hitech City

ట్యాంక్‌బండ్ పైన ఉన్న ఆంధ్రుల విగ్రహాలతో పాటు హుసేన్‌ సాగర్‌లో ఉన్న బుద్ధ విగ్రహానికి, హైటెక్‌ సిటిని కూడా తిరిగి తమకు పంపిస్తారా అని ప్రశ్నించారు.

జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా నగరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమయంలో ప్రారంభ ఉపన్యాయసం చేసిన ఆమె కేసీఆర్ విద్యుత్‌ నుంచి విగ్రహాల వరకు అన్ని పేచీ పెడుతున్నారన్నారు. అన్ని విధాల విభజనలో అన్యాయం చేసిన కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇంతటి కష్టంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా పని చేస్తున్నారన్నారు.

English summary
Telangana TDP leader Nannapannni Rajakumar asks about Buddha statue and Hitech City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X