నూతన సంవత్సరం వేళ నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు!!
తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరం బోలెడు కొత్త ఆశలతో, ఆకాంక్షలతో తోలిరోజును ప్రారంభించారు. ఇక రాజకీయ ప్రముఖులు సైతం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు.
ఇక ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పి తన బలమైన కోరికను స్పష్టం చేశారు. ఇక ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నూతన సంవత్సరం సందర్భంగా నేడు డిజిటల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నారా భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై స్కిల్ డెవెలప్మెంట్ కేసులో జైలుకు పంపిన సమయంలో 53 రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్న భువనేశ్వరి మీరంతా చంద్రబాబు కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు అన్నారు.
ముఖ్యంగా మహిళలు నా మనస్సులో ఎప్పటకీ ఉండిపోతారన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు గారి కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారన్నారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్న భువనేశ్వరి చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చునని పేర్కొన్నారు.
గతంలో భువనేశ్వరి పెద్దగా మీడియా ముందుకు వచ్చే వారు కాదు. కానీ చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత ఆమె ఆయన కోసం పోరాటం మొదలు పెట్టారు. జగన్ సర్కార్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలునుండి బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు కోసం ప్రజలు చూపిన ప్రేమను గుర్తు పెట్టుకున్న భువనేశ్వరి ప్రజలకు దగ్గరగానే ఉండే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications