నారా లోకేష్ పాదయాత్రపై కీలక విషయాన్ని వెల్లడించిన భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం 2600 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. 199వ రోజున చింతలపూడి నియోజకవర్గంలో బొర్రంపాలెం నుంచి ప్రారంభించి రావికంపాడు, దేవళంపల్లి, గురువాయిగూడెం, రామచంద్రాపురం, జంగారెడ్డి గూడెం వరకు పాదయాత్ర చేయనున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ తల్లి నారా భువనేశ్వరి తన కుమారుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ ప్రజలకు షేర్ చేసింది. అందులో ఏముందంటే.. రా లోకేష్ పాదయాత్ర చేస్తానన్నప్పుడు మొదట తాను వద్దన్నానని, కానీ లోకేష్ పట్టుబట్టడంతో సరే అన్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. పార్టీ కోసం కార్యకర్తలు ఇంతగా కష్టపడుతుంటే.. ప్రజలు, కార్యకర్తలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే వారికి నేనున్నానని భరోసా ఇచ్చేందుకు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

పాదయాత్రలో నారా లోకేష్ స్వయంగా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాను ఫోన్ చేసి అడిగినా అంతా బాగుందని చెబుతాడని, తన ఆరోగ్య సమస్యల గురించి మాత్రం చెప్పడదన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం ముందు తమ కష్టం ఏపాటిదన్నారు. నాలుగు సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ నారా లోకేష్ అండగా నిలబడుతున్నందుకు తల్లిగా తాను సంతోషిస్తున్నానన్నారు. ఇప్పటికే యాత్ర విజయవంతమైందని, పూర్తయ్యే సమయానికి మరింత విజయం సాధిస్తుందని అభిలషించారు.












Click it and Unblock the Notifications