పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన బ్రాహ్మణి..! చంద్రబాబే అడిగితే..!

ఏపీలో ప్రస్తుతం టీడీపీ అధికార పార్టీగా ఉంది. జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడుపుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రూపంలో తండ్రీ కొడుకులు మంత్రివర్గంలోనూ యాక్టివ్ గా ఉన్నారు. అయితే భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని లోకేష్ సతీమణి బ్రాహ్మణిని సైతం ఇప్పుడే రాజకీయాల్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతూనే ఉంటుంది. అయితే దీనిపై తాజాగా బ్రాహ్మణి నేరుగా స్పందించారు.

బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ 2025' కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణి.. రాజకీయాల్లో ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారని నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా ఆమె తన సమాధానం చెప్పేశారు. రాజకీయాలు తనకు ఆసక్తికరమైన రంగం కాదని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చేశారు.

Nara Brahmani Dismisses Political Entry Rumours Even If Chandrababu Requests

మరోవైపు తన మామగారు, సీఎం చంద్రబాబు అడిగితే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నిస్తే.. చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రానంటూ నారా బ్రాహ్మణి తేల్చిచెప్పేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థే తన తొలి ప్రాధాన్యమని, దాని ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె వెల్లడించారు. అలాగే లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశాన్ని తాను వదులుకోలేనని బ్రాహ్మణి తెలిపారు. ఇంకా చెప్పాలంటే పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఎందుకు వదులుకోవాలని అడిగారు. వ్యక్తిగతంగా ఆరోగ్యం, పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే తనకు ఎంతో ఆసక్తి ఉందని, ప్రస్తుతం ఆ రంగంలోనే పనిచేయడం సంతృప్తినిస్తోందని బ్రాహ్మణి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+