Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నారా లోకేష్ సేవాగుణంపై బ్రాహ్మణి కితాబు.. మంగళగిరి వాసులకు విజ్ఞప్తి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీ చేయడంతో అక్కడ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు నారా బ్రాహ్మణి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ను బ్రాహ్మణి అక్కడివారికి అర్థమయ్యేలా చెబుతున్నారు. లోకేష్ ది సేవా తత్వమని, ఎప్పుడు నలుగురికి మేలు చేయాలని ఆలోచన చేస్తుంటారని బ్రాహ్మణి వెల్లడించారు.

లోకేష్ ఎలాంటి వారో చెప్పిన బ్రాహ్మణి
మంగళగిరిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణి అక్కడి మహిళలతో లోకేష్ ఎలాంటి వారో అర్థమయ్యేలా వివరించారు.
సేవాగుణం, పదిమందికి మేలు చేయాలని తపన పడే తన భర్త నారా లోకేష్ కు ఓటేసి గెలిపించాలని ఆమె స్థానిక మహిళలకు విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఉపాధి కలిగించే విషయంలో లోకేష్ చాలా కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారని, హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభించేటప్పుడు కూడా నలుగురికి ఉపాధి దొరుకుతుందనే ఆలోచన చేసినట్టుగా చెప్పారు.

Nara Brahmani said lokesh qualities in Mangalagiri appeal locals to vote for lokesh

మహిళలకు ఉపాధి కోసం లోకేష్ ఆలోచన
మహిళల ఆర్థిక స్వావలంబనకు లోకేష్ చాలా ప్రాధాన్యత ఇస్తారని, నామమాత్రంగా చదువుకున్నా, అసలే చదువులేని మహిళలకు కూడా ఉపాధి కల్పించడానికి శాలరీ కోచ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉపాధి చూపిస్తున్నట్లుగా నారా బ్రాహ్మణి అక్కడ మహిళలకు తెలిపారు. లోకేష్ ఆలోచనలతోనే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని బ్రాహ్మణి కితాబిచ్చారు .

మహిళలకు స్త్రీ శక్తితి ఉపాధి
రైతుల కోసం గత ప్రభుత్వంలో లోకేష్ ఒక నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేసి, దీని ద్వారా రైతులకు ఉచిత బీమా సహాయ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారని వివరించారు. మంగళగిరి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, సస్త్రీ శక్తి పేరుతో కుట్టుపని నేర్పించి మహిళలకు 2610 కుట్టు మిషన్లను పంపిణీ చేశామని తెలిపారు.

లోకేష్ ను గెలిపించాలని కోరిన బ్రాహ్మణి
ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేకున్నా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో చేస్తున్నారని, ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరిన్ని మంచి కార్యక్రమాలు మీకోసం చేస్తారంటూ బ్రాహ్మణి మంగళగిరి వాసులకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్ వైభవం తీసుకురావడం ఎవరి వల్ల సాధ్యమవుతుందో ఒకసారి అందరూ ఆలోచించాలని నారా బ్రాహ్మణి కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+