రాజమండ్రిలో చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు వినాయక చవితికి దూరంగా రాజమండ్రిలోనే ఉన్నారు. వారం రోజుల నుంచి వారు ఇక్కడే ఉంటున్నారు. నారా లోకేష్ మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న లోకేష్, బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ బెంగ పెట్టుకోవడంతో బాలయ్య సతీమణి వసుంధర ఆ చిన్నారిని తీసుకొని రాజమండ్రికి వచ్చారు.
భువనేశ్వరిని, బ్రాహ్మణిని, వసుంధరను పార్టీ నాయకులతోపాటు మహిళా నాయకులు కూడా కలిశారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నన్నపనేని రాజకుమారి, ఆదిరెడ్డి అప్పారావు, జ్యోతుల నవీన్, తెలుగు మహిళా నాయకురాలు సత్యవాణి తదితరులు వచ్చి మాట్లాడి వెళ్లారు. రాష్ట్రంలో రాజధానిని నిర్మించాలన్నా, రహదారులు బాగుపడాలన్నా, శాంతి భద్రతలు కాపాడాలన్నా, పరిశ్రమలు రావడం, నిరుద్యోగం తగ్గడం లాంటివన్నీ తీరాలంటే పాలన దక్షుడైన చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందని ఈ నాయకులంతా అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుకు జరిగిన నష్టం కేవలం కుటుంబానికి కాదని, ఏపీ రాష్ట్రమే భవిష్యత్తును పోగొట్టుకుంటోందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని నన్నపనేని రాజకుమారి అన్నారు.

రాజమహేంద్రవరం శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి గారు, ఇతర కుటుంబ సభ్యులు#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang#SumanBoseExposesJagan#PsychoJaganExposed pic.twitter.com/kGmpNezcHT
— Telugu Desam Party (@JaiTDP) September 18, 2023
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం వైసీపీకి తగదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. ప్రభుత్వం, బహుళజాతి సంస్థలను వైసీపీ అపహాస్యం చేస్తోందని, పాలనలో వైసీపీ నాయకులు అసమర్థులని, సీమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలను నివృత్తి చేశారన్నారు. వైసీపీ నాయకులు మాత్రం కళ్లుండి కూడా వాటిని చూడలేకపోతున్నారని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు వెంట ఉన్నారని బ్రాహ్మణి అన్నారు.












Click it and Unblock the Notifications