90 శాతం నిధులు: మాట్లాడుతానన్న బాబు (ఫోటోలు)
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడానికి మనం అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం బెంగళూరులోని విధాన సౌధలో స్వచ్చ భారత్ అభియాన్ సమావేశం జరిగింది.
ఈ సందర్బంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ - కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు 90 శాతం నిధులు వారే కేటాయించాలని, 10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు.

స్వచ్చ భారత్ లో భాగంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ చైర్మన్ అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని స్పష్టం చేశారు. స్వచ్చ భారత్ విజయవంతం కావడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించాలని చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో మనవి చేశారు.

భారతదేశం శుభ్రంగా ఉన్నప్పుడే ఇక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, పేదలకు అన్ని వసతులు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చెయ్యాలని ఇదే సమావేశంలో పాల్గోన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు.












Click it and Unblock the Notifications