ముగిసిన లోకేష్ అమెరికా పర్యటన, ఇన్నోట్రెక్ సదస్సులో కేటీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అమెరికా పర్యటన ముగిసింది. తన పర్యటనలో లోకేష్ ఏడు నగరాల్లో ఐదువేల మంది ఎన్నారైలతో భేటీ అయ్యారు.
యువనేత సూచనలతో 2400 గ్రామాలను ఎన్నారైలు దత్తత తీసుకున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు.

మరోవైపు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన కొనసాగుతోంది. అతను పలువురు పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలతో భేటీ అవుతున్నారు. ఇన్నోట్రెక్ సదస్సులో పాల్గొన్నారు. టీ హబ్‌తో దేశంలో పరిశోధనలకు ఊతం అని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.
టీ హబ్ స్టార్టప్‌కు సిలికాన్ ప్రముఖులు సహకరిస్తామని చెప్పారన్నారు. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్ విడియా డాటా ప్రాసెసింగ్ కంపెనీ శాప్ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications