వాలంటీర్ల ముసుగులో మైనర్లపై లైంగికదాడులా..? మృగాళ్లపై చర్యలేవీ..? జగన్ సర్కార్‌పై లోకేశ్ ఫైర్..
ఆంధ్రప్రదేశ్‌లో వారంలో మైనర్లపై రెండు లైంగికదాడులు జరిగిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మృగాళ్లపై జగన్ సర్కార్ కఠిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఘటన తర్వాత జరిగిన... నెల్లూరు ఇన్సిడెంట్ గురించి లోకేశ్ ట్వీట్ చేశారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని లోకేశ్ ధ్వజమెత్తారు.
నెల్లూరు జిల్లా పెద్దరాజుపాలెంలో 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. గ్రామ వాలంటీర్ లైంగికదాడి చేయడం కలిచి వేసింది. ఇది సమాజం తలదించుకొనే ఘటన అని లోకేశ్ ట్వీట్ చేశారు. వాలంటీర్ల ముసుగులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడటం ఏంటీ అని ప్రశ్నించారు. సదరు మృగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దిశ చట్టం,21 రోజుల్లోనే బాధిత మహిళలకు న్యాయం, ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు అంతా ప్రచార ఆర్భాటమే తప్ప @ysjagan గారి పాలనలో మహిళలకు రక్షణే లేదు. వారం వ్యవధిలోనే మైనర్ బాలికల పై రెండు అత్యాచార ఘటనలు జరిగినా ప్రభుత్వం మృగాళ్ల పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 24, 2020
నెల్లూరు జిల్లా, పెద్ద రాజుపాలెం గ్రామంలో 9 ఏళ్ల బాలిక పై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకునే సంఘటన. వాలంటీర్ల ముసుగులో బాలికలు, మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలి.(1/2) pic.twitter.com/VzMPhwQJ65
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 24, 2020

Recommended Video
21 రోజుల్లోనే బాధిత మహిళలకు న్యాయం చేస్తామని జగన్ సర్కార్ ప్రగాల్బాలు పలికిందని లోకేశ్ ఫైరయ్యారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. దిశ పోలీసు స్టేషన్లు కూడా ప్రచార ఆర్భాటమే అన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు అని.. మైనర్ బాలికలపై లైంగికదాడులు జరుగుతున్న చర్యలు తీసుకోవడం లేదని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications