కేంద్ర న్యాయ శాఖ మంత్రితో నారా లోకేష్ భేటీ?
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో గడపనున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో లోకేష్ సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తో లోకేష్ భేటీ అవుతారు. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమౌతారు. జాతీయ నూతన విద్యా విధానం గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అనంతరం సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో భేటీ కానున్నారు నారా లోకేష్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చిస్తారని సమాచారం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని గతంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి అందజేస్తారని చెబుతున్నారు.
19వ తేదీ ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో సమావేశం అవుతారు. అనంతరం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. ఇటీవలే కుటుంబ సమేతంగా నారా లోకేష్.. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికి హాజరు కావాలని అప్పట్లో ప్రధాని మోదీని ఆహ్వానించారాయన. యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. చంద్రబాబు, నారా లోకేష్ స్వయంగా ఈ ఏర్పాట్లను సమీక్షించారు.












Click it and Unblock the Notifications