Nara Lokesh: డ్యూటీలోకి మంత్రి లోకేష్ - మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం..!

ఏపీలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా నారా లోకేష్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసినా ఇంతవరకూ లోకేష్ బాధ్యతలు చేపట్టలేదు. ఇవాళ మంచి ముహుర్తం చూసుకుని ఆయన సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కీలకమైన మెగా డీఎస్సీ విధివిధానాల ఫైలుపై తన తొలి సంతకం చేశారు.

నారా లోకేష్ ఈసారి ఎలాంటి ఆడంబరాలు లేకుండా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన కుర్చీపై వేసిన అదనపు కవర్ ను కూడా తానే స్వయంగా తొలగించారు. తనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ వద్దని అధికారులకు తేల్చిచెప్పేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ 208లో బాధ్యతలు చేపట్టారు.

nara Lokesh assumes office as hrd IT and Electronics minister first sign on dsc guidelines file

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తన తొలి సంతకం చేశారు. అనంతరం దీన్ని కేబినెట్ ఆమోదం కోసం పంపారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నిర్వహణపై సీఎం చంద్రబాబు తన తొలి సంతకం చేశారు. ఇప్పుడు లోకేష్ విధివిధానాల ఫైలుపై కూడా సంతకం చేయడంతో ఈ రెండు ఫైళ్లకూ ఇవాళ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతో మెగా డీఎస్సీ నిర్వహణకు మార్గం సుగమం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+