ఆ విషయంలో చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన నారా లోకేష్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మద్దతును చూరగొనడం కోసం నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు వరుస పర్యటనలతో, పాదయాత్రలతో, బస్సు యాత్రలతో, బహిరంగ సభలతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక ఈ కోవలో టీడీపీ దూసుకుపోయే ప్రయత్నం చేస్తుంది.
ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రికార్డును టీజీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. టిడిపి అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. 2012లో రెండు వందల ఎనిమిది రోజుల్లో చంద్రబాబు నాయుడు 2,817కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేయగా, లోకేష్ 206 రోజుల్లో 2817 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుని పార్టీ శ్రేణులతో ఔరా అనిపించారు.

దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో 90 రోజుల్లో నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోబోతుంది. ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల మద్దతును కూడగట్టడం కోసం నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 207 వ రోజుకు చేరింది.
రెట్టించిన ఉత్సాహంతో లోకేష్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు ప్రస్తుతం నరసాపురం మండలం సీతారాంపురం నుంచి 207వ రోజు పాదయాత్రను కొనసాగిస్తున్న లోకేష్ కు టిడిపి శ్రేణుల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు లోకేష్ పాదయాత్రలో హుషారుగా పాల్గొంటున్నారు.
యువనేత లోకేష్ కు గుమ్మడి కాయలతో దిష్టి తీస్తూ హారతులు పడుతూ నీరాజనాలు పలుకుతున్నారు. జోరున వర్షం కురుస్తున్న కూడా నారా లోకేష్ తన పాదయాత్రను కొనసాగించారు. అవరోధాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, వరుసగా అనేక చోట్ల కేసులు నమోదైనా వెనుకడుగు వెయ్యకుండా, పాదయాత్రను ఆపకుండా నారా లోకేష్ కొనసాగించి తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డును బ్రేక్ చేశారు.












Click it and Unblock the Notifications