Nara Lokesh: పార్టీలో మార్పులు రావాలి
మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి అసలైన బలం కార్యకర్తలేనని, పార్టీపై కమిట్‌మెంట్ ఉన్నవారికే బాధ్యతలు అప్పగించామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి దేశవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని ఆయన పేర్కొన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ పార్టీ కమిటీ వర్క్‌షాప్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... పార్టీ కమిటీల్లో బాధ్యతలు పొందినవారిలో 83 శాతం మంది తొలిసారిగా అవకాశం పొందిన వారేనని తెలిపారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా పనిచేసే వారిని ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలే పార్టీకి అసలైన సంపద అని వ్యాఖ్యానించారు.

కార్యకర్తలే పార్టీకి ప్రాణం
దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురయ్యే కష్టాలను టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని లోకేష్ గుర్తుచేశారు. నామినేషన్ సమయంలో దాడులు, పోలింగ్ కేంద్రాల్లో హింస, ప్రాణాలను పణంగా పెట్టిన ఘటనలను ప్రస్తావిస్తూ... అలాంటి కార్యకర్తలే తనకు ప్రేరణ అని అన్నారు. తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఇలాంటి అంకితభావం గల కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
చేసిన పనులు చెప్పుకోవాలి
అభివృద్ధి చేయడమే కాకుండా, ప్రజలకు వాటిని వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని లోకేష్ స్పష్టం చేశారు. పెన్షన్‌ను తొలిసారి ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అని, దాన్ని కాలక్రమేణా పెంచుతూ వచ్చిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. ప్రభుత్వం చేసిన ప్రతి మంచి పని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో ప్రతి పదవికి టర్మ్ లిమిట్ ఉండాలన్నది తన అభిప్రాయమని లోకేష్ చెప్పారు. ఒకే వ్యక్తి పదవుల్లో కూర్చోకుండా ప్రమోషన్ పొందాలని సూచించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో వరకు ఎదగాలని తన లక్ష్యమన్నారు. పార్లమెంట్ పార్టీ కమిటీ వ్యవస్థ తీసుకురావడానికి 18 నెలలు పోరాడాల్సి వచ్చిందని వెల్లడించారు.
యువత, మహిళలకు ప్రాధాన్యం
రాజకీయాల్లో యువతను, మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని లోకేష్ తెలిపారు. కార్యకర్తలే నాయకులనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయం, రైతులకు అండ, తెలుగుజాతి విశ్వఖ్యాతి లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందన్నారు.
పార్టీ సొంతిల్లు... ప్రభుత్వం కిరాయి ఇల్లు
పార్టీ శాశ్వతమని, ప్రభుత్వం తాత్కాలికమని లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయానికి సమయం కేటాయించాలని, చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి కార్యకర్తలను కలుస్తున్నారని చెప్పారు. కేంద్రం-రాష్ట్రం సమన్వయంతో అమరావతి, పోలవరం, విశాఖ పెట్టుబడులు వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
అభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం
పార్టీ నేతలు అలక వీడాలి. ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. అలక వల్ల మనం నష్టపోతాం. ఏదైనా ఉంటే పార్టీలో పోరాడాలి. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పవనన్న చెప్పారు. కూటమి అంటే మూడు పార్టీల కలయిక. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం కృషిచేయాలి. మనకు విడాకులు లేవు, క్రాస్ ఫైర్స్ లేవు, కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. మనం అప్రమత్తంగా ఉండాలి. మన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. - మంత్రి నారా లోకేష్.
ఐక్యతతోనే ముందుకు
కూటమిలో చిన్న సమస్యలు వచ్చినా వాటిని పార్టీలోనే పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు. విభేదాలు సృష్టించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పదవిని గౌరవంగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
వర్క్‌షాప్‌లో పాల్గొన్న నేతలను మంత్రి లోకేష్ స్వయంగా ఆహ్వానించి పలకరించారు. అనంతరం శిక్షణ తరగతులకు స్వయంగా హాజరై, వెనుక కూర్చుని పాఠాలు విన్నారు. యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications