జగన్ కోటలో చక్రం తిప్పుతున్న లోకేష్: జగన్ ఫోన్‌కు నో, మైసూరారెడ్డి షాక్!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా కడప జిల్లాలో చక్రం తిప్పుతున్నారు! కడప జిల్లాలో వైసిపిని మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా లోకేష్ పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన కడప జిల్లాలో తిష్టవేశారు.
రెండో రోజైన గురువారం నాడు కడపతో పాటు కమలాపురం, మైదుకూరు, పులివెందుల ప్రాంతాల్లోని తెలుగుదేశం కార్యకర్తలతో నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్ఠతకు పలు సూచనలు, సలహాలను ఇవ్వనున్నారు.
బుధవారం కడప జిల్లాలోని ద్వితీయశ్రేణి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, భవిష్యత్తు మనదేనని, పార్టీ కోసం పని చేసేవారి కోసం ఎన్నో పదవులు ఎదురుచూస్తుంటాయని భరోసాను ఇచ్చారు. గురువారం కూడా ఆయన పలువురితో భేటీ కానున్నారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్?
కడప గడపలో వైసిపి అధినేత జగన్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాకివ్వనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతుండగా మరోవైపు జగన్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన జగన్ నేరుగా పులివెందుల చేరుకుని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. దీనికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గైర్హాజరు కావడం గమనార్హం. ఇప్పటికే వీరిద్దరూ కూడా టిడిపిలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.
వీరితో కనీసం ఫోన్లో మాట్లాడాలని జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నేడో, రేపో పచ్చ కండువా పుచ్చుకోవడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వైసిపి కంచుకోటగా ఉన్న కడపలో భారీ నష్టం జరిగినట్టే. టిడిపిలోకి చాలామంది వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ పర్యటనకు మైసూరా రెడ్డి దూరం
వైసిపి నేత మైసూరా రెడ్డి... జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన జగన్ పర్యటనకు దూరంగా ఉండటం గమనార్హం.

లోకేష్,జగన్
కడప జిల్లాలో వైసిపి నేత నారా లోకేష్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. మరోవైపు, జగన్ తన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మంతనాలు జరుపుతున్నారు.

కడపలో చక్రం తిప్పుతున్న లోకేష్, మరో ఇద్దరూ..: జగన్ ఫోన్ చేస్తే నో
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు బుధవారం టిడిపిలో చేరారు. వైసిపికి చెందిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసానికి వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కడపలో చక్రం తిప్పుతున్న లోకేష్, మరో ఇద్దరూ..: జగన్ ఫోన్ చేస్తే నో
అనంతరం ఎమ్మెల్యే జయరాములు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దళితుల అభ్యన్నతి కోసం చేస్తున్న కృషికి తాను ఆకర్షితుడినైనట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన తాను ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా గాలేరు, నగరి, సుజల స్రవంతి, వెలుగోడు, బ్రహ్మసాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి సుముఖత చూపారని తెలిపారు.

కడపలో చక్రం తిప్పుతున్న లోకేష్, మరో ఇద్దరూ..: జగన్ ఫోన్ చేస్తే నో
రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మాటిచ్చారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లోగా మరి కొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నారన్నారు.












Click it and Unblock the Notifications