వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి లోకేష్ ఝలక్, మంత్రిగారూ! మీ మాటలే, బుజ్జి ప్రశ్నకు చెంబదెబ్బ.. లోకేష్‌కు దిమ్మతిరిగే షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: జూన్ 2 రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు తెలుగు రాష్ట్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో ఆగ్రహంతో ఉన్న పలువురు ఆయన ట్వీట్‌కు స్పందించారు. విమర్శలు గుప్పించారు. దీనిని గుర్తించిన ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధానికి కౌంటర్ ట్వీట్ చేశారు.

ఆ వెదవలకు ఇదే సమాధానం, నేనేదో థర్టీ అంటూ బతుకుతున్నా: చంద్రబాబుపై కమెడియన్ పృథ్వీఆ వెదవలకు ఇదే సమాధానం, నేనేదో థర్టీ అంటూ బతుకుతున్నా: చంద్రబాబుపై కమెడియన్ పృథ్వీ

'డియర్ నరేంద్ర మోడీ సర్, తన హక్కుల కోసం రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ మీ ట్వీట్‌తో చల్లబడుతుందని మీరు ఆలోచిస్తున్నట్టయితే మీరు తప్పకుండా ఇక్కడున్న కామెంట్స్‌ను చూడాల్సిందే. మీరు చదివేందుకు కేవలం కొన్ని కామెంట్స్‌ను యాడ్ చేస్తున్నాను. ఇవి మీ సోమవారాన్ని పాడు చేయవని ఆశిస్తున్నాను' అని లోకేష్ పేర్కొంటూ.. ప్రధానిని ఉద్దేశించి నెటిజన్లు చేసిన కామెంట్స్‌లో కొన్నింటిని అటాచ్ చేశారు.

లోకేష్‌కు రివర్స్, మోడీకి సరే మీ మాటేమిటి?

ప్రత్యేక హోదాను గుర్తు చేస్తూ, మోడీ శుభాకాంక్షలను తిరస్కరిస్తూ కొందరు నెటిజన్లు చేసిన ట్వీట్లను లోకేష్ ట్వీట్ చేయగా.. అందుకు మరికొందరు వెంటనే స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో మీరు ఎన్నిసార్లు మాటలు మార్చారో గుర్తు చేసుకోవాలని సూచించారు. మరికొందరు ఇద్దరూ (బీజేపీ, టీడీపీ) దొంగలేనని ట్వీట్ చేశారు.

మోడీగారూ.. గుర్తుకు ఉన్నామా?

నరేంద్ర మోడీ ట్వీట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు. 'ఓ మైగాడ్, మీకు మేం గుర్తున్నామా', 'మాకు కొన్ని ఎక్కువ నిధులు కావాలి, మీ శుభాకాంక్షలు కాదు', 'మాకు శుభాకాంక్షలు వద్దు.. రైల్వేజోన్ కావాలి', 'మాకు నీ ఫేక్ అభిమానం అవసరం లేదు' అని మరికొందరు.. ఇలా మోడీ ట్వీట్‌పైస్పందించారు.

మోడీ కౌంటర్లపై నారా లోకేష్ ట్వీట్

మోడీ ట్వీట్‌పై నెటిజన్ల చేసిన స్పందనలో కొన్నింటిని లోకేష్ సేకరించి ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. 'ఏపీ భారతదేశంలో లేదామోడీ నార్త్ ఇండియాకు మాత్రమే ప్రధానిగా ఉన్నారా','విశాఖపట్నంకు రైల్వేజోన్ ఇచ్చే వరకు బీజేపీకి ఓటు వేయవద్దని మేం నిర్ణయించుకున్నాం సర్', 'గుజరాత్‌లోని దొలేరా నిర్మాణంపై కాదు, అమరావతి నిర్మాణంపై దృష్టి సారించండి', 'శుభాకాంక్షలు ఎందుకు, ప్రార్థించడం కంటే సాయం చేసే చేతులు మిన్న అంటారు. మీరు అది చేయండి'.. ఇలా పలువురు నెటిజన్ల ట్వీట్లను లోకేష్ పొందుపర్చారు.

ఒక బాబు, వంద నాలుకలు

నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్‌కు కూడా బాగానే కౌంటర్లు వచ్చాయి. 'ఒక బాబు, వంద నాలుకలు' అంటూ హోదాపై చంద్రబాబుపై ఎన్నిసార్లు మాట మార్చారో చెబుతూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని పొందుపర్చారు.

మనమే ఎక్కువ సాధించాం

మనమే ఎక్కువ సాధించాం

మరొకరు గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్‌కు సంబంధించి ఈనాడులో వచ్చిన కథనాన్ని పోస్టు చేశారు. మనమే ఎక్కువ సాధించామన్న ఆ పోస్టులో.. ఏ రాష్ట్రానికైనా బీజేపీ ఇంతకంటే ఎక్కువ ఇచ్చిందా, ఆధారాలు ఉంటే చెప్పండని, హోదాతో సమానమైనవన్నీ వచ్చాయని, ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పినట్లుగా ఉంది.

లోకేష్ గారు ఇవి మీ మాటలే

ఒకసారి నీ పోల్ ప్రామిస్‌లు ఎన్ని నెరవేర్చావో చూడమని,మోడీ-చంద్రబాబు.. ఇద్దరు తోడుదొంగలని, అమరావతి గురించి చంద్రబాబు చెప్పిన డిజైన్లు, పప్పు అంటూ, బాగానే చెప్పారు కానీ ప్యాకేజీ ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలంటూ కౌంటర్లు ఇచ్చారు. లోకేష్ గారూ.. ఇవి మీరు చెప్పిన మాటలే అంటూ మరొకరు బుజ్జి ప్రశ్నకు చెంపదెబ్బ అని ఓ వీడియో పోస్ట్ చేశారు.

English summary
Andhra Pradesh Minister and Telugudesam party leader Nara Lokesh counter to PM Narendra Modi for his tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X