బాలయ్య వీర సింహారెడ్డి సినిమాపై ట్రోలింగ్- నారా లోకేష్ ఫైర్- ప్యాలెస్ పిల్లి చీప్ ట్రిక్స్ !

ఎప్పుడూ రాజకీయాల గురించి మాత్రమే ట్వీట్లు, విమర్శలు చేసే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇవాళ తన మామయ్య బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డి గురించి ట్విట్టర్ లో స్పందించారు. అదీ ఈ చిత్రాన్ని ట్రోల్ చేస్తూ పెడుతున్న ట్వీట్లపై స్పందించారు. అదీ ఓ టీడీపీ సానుభూతిపరుల ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ ట్రోల్ కావడంతో దానిపై లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ యువనేత నారా లోకేశ్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే, తన మామయ్య కూడా అయిన నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహారెడ్డిపై స్పందించారు. బాలయ్య తాజా చిత్రం రాక నేపథ్యంలో బాలకృష్ణ సినిమాలను చిరంజీవి సినిమాలతో పోలుస్తూ కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ సినిమాలు అణగారిన వర్గాలను కించపరిచేవిలా ఉన్నాయంటూ టీడీపీకి చెందినదిగా భావిస్తున్న ఓ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్టు అయ్యింది. దీనిని చూసిన లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఈ పోస్ట్ ఫేక్ అంటూ లోకేశ్ ప్రకటించారు.

nara lokesh counter to trolling on unclie balayyas veerasimha reddy movie in twitter

అలాగే ఫేక్ ట్వీట్లు చేసే లక్షణం వైసీపీదేనని నారా లోకేష్ ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ టార్గెటా్ చేశారు. ''ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి. ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మ సంతృప్తిని ఇస్తాయేమో గానీ నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి'' అంటూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో లోకేష్ ట్వీట్ వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+