అజిత్ పవార్ ఎక్కిన ఫ్లైట్ కూ, హెరిటేజ్ కు లింక్? తేల్చేసిన లోకేష్..!
ఈ ఏడాది మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో ప్రయాణించిన విమానం కుప్పకూలి ఆయన దుర్మరణం పాలయ్యారు. ఈ విమాన యాజమాని అయిన వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థతో ఏపీలోని సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ కు లింకులు ఉన్నాయంటూ తాజాగా ఆరోపణలు వచ్చాయి. అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా విడుదల చేశారు. వీటి ఆధారంగా వైసీపీ కూడా ఇదే ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై మంత్రి నారా లోకేష్ (nara lokesh) ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కి, అజిత్ పవార్ ప్రయాణించిన విమాన సంస్థ వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదని లోకేష్ తేల్చిచెప్పేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. గతంలో బాబాయ్ వివేకాను చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టిన వైసీపీ.. ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్‌పై అలాంటి అలాంటి ఆరోపణలే చేస్తోందన్నారు. హెరిటేజ్ ఫిన్ లీస్ 1996లో స్థాపించిన సంస్థ అని, 2022లో వీఎస్ఆర్ ఏవియేషన్ స్థాపించారని గుర్తుచేశారు. హెరిటేజ్ ఫిన్ లీజ్ వద్ద వీఎస్ఆర్ సంస్థ కూడా చాలా సంస్థల మాదిరిగానే ఫైనాన్స్ తీసుకుందన్నారు.

ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని, తమ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వీఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది యాక్సిడెంట్‌కు గురవుతుందని తాము కలగన్నామా?, తాము ఏమన్నా జ్యోతిష్యులమా..? అని లోకేష్ ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా తాను వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు మీడియాకు అందిస్తానని ఆయన ప్రకటించారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకి తానెందుకు సమాధానం చెప్పాలంటూ లోకేష్ ఎదురుప్రశ్నించారు. అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమున్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications