అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ చెప్పింది నిజమే కదా: ఏపీ-తెలంగాణపై నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆంధ్రా పాలకులు హైదరాబాదులో విధ్వంసం చేశారని కేసీఆర్ ఇటీవల అన్నారు. దీనిపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

అలా జగన్ పార్టీ కుట్ర, 40 చోట్ల ఇబ్బంది: చేతులెత్తేసిన బాబు! సీ ఓటరు సర్వేపై ఆగ్రహంఅలా జగన్ పార్టీ కుట్ర, 40 చోట్ల ఇబ్బంది: చేతులెత్తేసిన బాబు! సీ ఓటరు సర్వేపై ఆగ్రహం

ఇప్పుడు నారా లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. జాతీయ ఛానల్లో కేసీఆర్ చెప్పిన మాటలకు కౌంటరిచ్చారు. తెలంగాణకు, నవ్యాంధ్రకు మధ్య పోలిక లేదనే విషయం నిజమే కదా అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఏపీకి కియా మోటార్స్, అపోలో టైర్స్, ఏషియన్ పేయింట్స్ వచ్చాయని చెప్పారు.

 తెలంగాణలో ఆ పరిస్థితి లేదు

తెలంగాణలో ఆ పరిస్థితి లేదు

తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదని నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి బడా కంపెనీలు తరలి వస్తున్నాయని, భారీ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. నవ్యాంధ్ర కొత్త రాష్ట్రమయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సత్తా కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని పలుమార్లు టీడీపీ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే.

 కేసీఆర్ ఏమన్నారంటే

కేసీఆర్ ఏమన్నారంటే

ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి, తెలంగాణకు ఏమాత్రం పోలిక లేదని చెప్పారు. దేశంలోనే తొలి స్థానానికి ఎదుగుతామన్నారు. స్వాతంత్రానికి ముందు నుంచే తెలంగాణ సుసంపన్న రాష్ట్రమని చెప్పారు.

 కేసీఆర్ ఆ మాటకు చంద్రబాబు కౌంటర్

కేసీఆర్ ఆ మాటకు చంద్రబాబు కౌంటర్

కాగా, ఇటీవల కేసీఆర్ ఆంధ్రా పాలకులపై విమర్శలు కూడా చేశారు. ఆంధ్రా పాలకులు హైదరాబాదులో విధ్వంసం సృష్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్ అలా అనడం సరికాదన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది మనమే అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు.

 విభజన వల్లే మేం నష్టపోయాం

విభజన వల్లే మేం నష్టపోయాం

కేసీఆర్ వ్యాఖ్యలపై అంతకుముందు కూడా చంద్రబాబు స్పందించారు. అభివృద్ధిలో తెలంగాణతో ఏపీకి పోలిక లేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పారు. ఏపీ వెనుకబడిపోవడానికి కారణం ప్రజలు కాదని, విభజన వల్లే తాము నష్టపోయామని చెప్పారు.

English summary
Andhra Pradesh IT minister Nara Lokesh responded on Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X