'టికి వ్యతిరేకం కాదన్న లోకేష్‌కు టి-టిడిపి బాధ్యతలు'
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌కు ఇస్తే స్వాగతిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత నర్సా రెడ్డి ఆదివారం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు గుడి కట్టినప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్న లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పేమిటన్నారు.
తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని లోకేష్ స్పష్టంగా చెప్పినప్పుడు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలోను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపిని ప్రజలు ఎందుకు ఆదరించరని ప్రశ్నించారు.

కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి(జివోఎం)కు తాము హాజరయ్యేది లేదని టిడిపి శాసన సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి వేరుగా అన్నారు. వరంగల్ జిల్లాలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం జరిగితే అందుకు కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు సమాన బాధ్యత వహించాలన్నారు.
బాబు, కాంగ్రెస్‌పై కెటిఆర్ ఫైర్
అఖిల పక్షం కోసం డిమాండ్ చేసిన టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశానికి వెళ్లనని చెప్పడం ఎంత వరకు సమంజసమని తెరాస శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. సీమాంధ్ర నాయకులు ఏకపక్షంగా నివేదికలు ఇస్తుంటే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications