వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?.. స్కూల్స్ సెలవులు పొడిగించండి.. జగన్‌కు లోకేష్ లేఖ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ విద్యాసంస్థలకు సెలవులను రద్దు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకోస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులను పొడించాల‌ని సీఎం జగ‌న్‌ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయని పేర్కొన్నారు. గత వారం నుంచి ఏపీలో కరోనా కేసులు వీపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్ ప్రారంభిస్తే పెనుప్రమాదం పొంచి ఉందని లేఖలో పేర్కొన్నారు.

ప‌లు రాష్ట్రాలు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు

ప‌లు రాష్ట్రాలు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు

ఏపీలో కరోనా థర్డ్ వేవ్ తీవ్రమౌతోందన్నారు లోకేష్. కేసుల సంఖ్య కూడా గత వారం రోజులుగా రెట్టింపు అవతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా విలయతాడవంతో అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్‌కి సెలవులు ప్రకటించాయని లేఖలో పేర్కొన్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదన్నారు.

ప్రాణాలతో చెలగాటమాడోద్దు..

ప్రాణాలతో చెలగాటమాడోద్దు..

థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మళ్లీ స్కూల్స్ ప్రారంభించి విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని లోకేష్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు. స్కూల్స్‌ను ప్రారంభిస్తే పెను ప్రమాదం పొంచి ఉందని ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పేయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పిల్లల తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేయకుండా తక్షణమే విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఏపీలో తెరచుకున్న పాఠ‌శాల‌లు

ఏపీలో తెరచుకున్న పాఠ‌శాల‌లు

ఏపీలో సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో స్కూల్స్ యథావిధిగా తెరచుకున్నాయి. విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా పాఠశాలలకు రావాల్సిందేనని అథికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనాతో ఇప్పటికే రెండేళ్లుగా విద్య డిస్టర్బ్ అయిందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరమైనా అలా జరగకుండా విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ విద్యా బోధన జరుగుతందని చెబుతున్నారు. మ‌రోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అటు తల్లిదండ్రులలో టెన్షన్ నెలకొంది.

English summary
Schools reopen in ap, Nara lokesh letter to cm jagan on holidays..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X