Nara Lokesh: రాజీనామాకు సిద్దమైన లోకేష్.. మహానాడు వేళ సంచలనం..!
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న మంత్రి నారా లోకేష్ ఇవాళ కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహానాడులో చర్చించాల్సిన ఆరు కీలక అంశాల అజెండాను హాజరైన టీడీపీ శ్రేణుల ముందుంచారు. అంతే కాదు రాజీనామాకు సిద్దమంటూ నారా లోకేష్ ఓ కీలక ప్రకటన చేశారు. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి, ఎందుకు చేశారో ఓసారి చూసేద్దాం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పలు సంస్థలకు భూముల కేటాయింపులు చేస్తోంది. ఇందులో భాగంగా ఉర్సా అనే సంస్థకు విశాఖలో భూములు కేటాయించింది. 2 వేల ఎకరాల మేర జరిగిన ఈ కేటాయింపులకు నామమాత్రంగా ఎకరాకు 99 పైసలు ఎలా వసూలు చేస్తారంటూ విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న మహానాడులో మరోసారి లోకేష్ స్పందించారు.

ఉర్సా సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి కేటాయించినట్లు జగన్ నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్దమని నారా లోకేష్ మహానాడు వేదికగా సవాల్ విసిరారు. టీసీఎస్ కు మాత్రమే 99 పైసలకు ఎకరా చొప్పున భూములిచ్చామని, ఉర్సాకు మాత్రం మార్కెట్ రేటుకే భూమి కేటాయించినట్లు లోకేష్ క్లారిటీ ఇచ్చారు. వీటి ద్వారా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగితే ఇక ఆ నగరాన్ని అందుకోవడం కష్టమే అన్నారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ఎంతో చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇక పరిశ్రమలు రావడమే కానీ పోవడం ఉండదన్నారు.












Click it and Unblock the Notifications