అవన్నీ ఊహాగానాలే, ప్రత్యక్షరాజకీయాల్లో ఉన్నా: పోటీకి సిద్ధమన్న లోకేష్

తెలుగు ప్రజలకు ప్రపంచంలో గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, టిడిపి నేత నారా లోకేష్ అన్నారు.

విజయవాడ: తెలుగు ప్రజలకు ప్రపంచంలో గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్బంగా ఆయన విజయవాడలో ఎన్టీఆర్ మ్యూజియం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

సినీ, రాజకీయాల్లో అన్నగారిది స్పెషల్ మార్క్ అని చెప్పారు. అన్నగారు రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లోనే అధికారం చేపట్టి ప్రభంజనం సృష్టించారని లోకేష్ తెలిపారు.
ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆయనకు కృతజ్ఞతగా విజయవాడలో మ్యూజియం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలను అందుబాటులో ఉంచామని చెప్పారు.
తెలుగు ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ చూడాలని కోరారు. అన్నగారి తొలినాళ్ల నుంచి విశేషాలున్నాయని చెప్పారు.

nara lokesh on his political entry

అన్నగారి జ్ఞాపకాలు ఎవరి వద్దైనా ఉంటే.. దయచేసి ఎన్టీఆర్ ట్రస్ట్‌కు కంట్రిబ్యూట్ చేయాలని కోరారు. మొదట మ్యూజియంను నిమ్మకూరులో ఏర్పాటు చేయాలనుకున్నామని.. పలువురి సూచన మేరకు అమరావతిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను పుట్టినప్పటికే అన్నగారు రాజకీయాల్లోకి వచ్చేశారని చెప్పారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కొనసాగుతుందని చెప్పారు. లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పేరిట రక్తం సేకరించి అవసరమున్న వారికి అందజేస్తున్నామని చెప్పారు. గత సంవ్సతం14వేలమంది రక్తదానం చేయగా, ఈ యేడాది 20వేల మంది రక్తదానం చేస్తున్నారని చెప్పారు.

ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా..

ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు, మంత్రి పదవి చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయని.. మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అవన్నీ ఊహాగానాలేనని నారా లోకేష్ కొట్టిపారేశారు. పార్టీ ఇప్పటి వరకూ ఏ నిర్ణయంపై చర్చించలేదని చెప్పారు. టిడిపిలో ఏ బాధ్యతలు ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నానని, పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+