పవన్ చెబితేనే సమస్య పరిష్కారమా?: లోకేష్, ‘జగన్ ఏకైక వ్యక్తి’

Subscribe to Oneindia Telugu
  పవన్ చెబితేనే సమస్య పరిష్కారమా? లోకేష్ : ‘జగన్ ఏకైక వ్యక్తి’ Nara Lokesh About YS Jagan

  విజ‌య‌వాడ: పట్టిసీమను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ దుర్గాఘాట్‌వద్ద విద్యాధరపురం వాటర్‌ హెడ్‌ వర్క్‌లో నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొన్నారు.

  అన్ని స్థానాల్లోనూ..

  అన్ని స్థానాల్లోనూ..

  ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను రికార్డుస్థాయిలో పూర్తిచేసిన ఘనత కారణంగానే ఇది సాధ్యమైందని వివరించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ గెలిచేందుకు కృషిచేస్తున్నామని లోకేశ్‌ అన్నారు.

  జగన్ రోజుకో మాట..

  జగన్ రోజుకో మాట..

  రెఫరెండంపై జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారని లోకేష్ ఆరోపించారు. పులివెందుల ప్రజలు కూడా టీడీపీని ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. 2019లోనూ టీడీపీదే అధికారమని లోకేష్ స్పష్టం చేశారు.

  పార్టీలోకి ఎవరైనా రావొచ్చు..

  పార్టీలోకి ఎవరైనా రావొచ్చు..

  80శాతం బలమైన నేతలు టీడీపీలో ఉన్నారని చెప్పారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా రావాలనుకుంటే రావొచ్చని అన్నారు. కాపుల రిజర్వేషన్లను అమలు చేస్తామని లోకేష్ చెప్పారు. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఏపీనేనని అన్నారు.

  పవన్ చెబితేనే పరిష్కారమా?

  పవన్ చెబితేనే పరిష్కారమా?

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబితేనే ప్రభుత్వం స్పందిస్తోందనడం సరికాదని లోకేష్ అన్నారు. ప్రభుత్వం ముందుకు ఎవరు సమస్య తెచ్చిన పరిష్కరిస్తుందని చెప్పారు. మిర్చి రైతుల సమస్యను ప్రభుత్వమే పరిష్కరించిందని లోకేష్ గుర్తు చేశారు.

  సీఎం లక్ష్యాన్ని సాధిస్తాం

  సీఎం లక్ష్యాన్ని సాధిస్తాం

  నీరు లేకుంటే అభివృద్ధి కష్టమని సీఎం చంద్రబాబు గ్రహించారని, అందుకే గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేస్తున్నారని లోకేష్ తెలిపారు. సీఎం ఇచ్చిన లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. సీమలో 23ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌, దుర్గగుడి ఈవో తోపాటు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు గద్దెరామ్మోహన్‌, జలీల్‌ఖాన్‌, ఎమ్మెల్సీలు బుద్దావెంకన్న, బచ్చుల అర్జునుడు, తదితరులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోరువర్షంలోనూ కృష్ణానదికి హారతి కార్యక్రమం విజయవంతంగా సాగింది. రాష్ట్రంలో ఏమూలకెళ్లినా ఎర్రరంగు గోదావరి నీళ్లే దర్శనమిస్తున్నాయని నారాలోకేశ్‌ తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh minister Nara Lokesh on Friday lashed ouat at YSRCP president YS Jaganmohan Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి