Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నారా లోకేశ్ పాదయాత్ర ముహూర్తం ఫిక్స్ - జగన్ రికార్డులపై గురి..!!

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ముహూర్తం ఖరారైంది. 2024 ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్న టీడీపీ..ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వ్యూహాలు - అభ్యర్ధుల ఎంపిక..ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల పైన ఫోకస్ పెట్టనున్నారు. ఇదే సమయంలో నారా లోకేశ్ తన తండ్రి గతంలో నిర్వహించిన మీ కోసం యాత్ర తరహాలో పాదయాత్రకు నిర్ణయించారు. ఇందుకు తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచే యాత్ర ప్రారంభించనున్నారు.

Nara Lokesh Padayatra muhurtam fixed, Scheduled for above 400 days across the state

ఏడాది పాటు ప్రజల్లో ఉండేలా
2023 జనవరి 27న నారా లోకేశ్ పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు అయింది. జగన్ 2017లో ఇడుపుల పాయ టు ఇచ్ఛాపురం పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు లోకేశ్ కుప్పం టు ఇచ్ఛాపురం యాత్రకు డిసైడ్ అయ్యారు. దాదాపుగా ఏడాదికి పైనగా లోకేశ్ పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయాలనేది లోకేశ్ వ్యూహం. ఇప్పటికే నియోజకవర్గాల సమీక్షల ద్వారా దాదాపు అభ్యర్దులు ఎవరనేది అటు చంద్రబాబు స్పష్టత ఇస్తున్నారు. దీంతో..సంబంధింత ఎమ్మెల్యే అభ్యర్దులు..పార్టీ నేతలు యాత్రలో పాల్గొనేలా రూపకల్పన చేస్తన్నారు. ప్రతీ మండలంలో రోడ్ షో.. ప్రతీ నియోజకవర్గంలో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

Nara Lokesh Padayatra muhurtam fixed, Scheduled for above 400 days across the state

యాత్రలో యువతకు ప్రాధాన్యత
టీడీపీ యువత ఎక్కువ సంఖ్యలో ఈ యాత్రను ఫాలో అవుతుందని తెలుస్తోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు.. నిరుద్యోగం ప్రధాన అంశాలుగా సాగనున్న ఈ యాత్రలో వైసీపీ పాలనలో జరిగిన నష్టం వివరించటంతో పాటుగా.. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఏ విధంగా అండగా నిలిచేదీ లోకేశ్ వివరించనున్నారు. అదే విధంగా.. రాష్ట్రంలో రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీ యువతకు 50 శాతం సీట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. లోకేశ్ తన యాత్రలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు.

Nara Lokesh Padayatra muhurtam fixed, Scheduled for above 400 days across the state

నాటి జగన్ రికార్డులను అధిగమిస్తారా
జగన్ నాడు 341 రోజుల్లో 3,648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేసారు. ఇప్పుడు దానిని అధిగమించాలనేది లోకేశ్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, రాజకీయ పరిణామాలు -ఎన్నికల షెడ్యూల్ పైన అంచనాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్ కు తుది రూపు ఇవ్వనున్నారు. ఎన్నికల ఏడాది పార్టీ కేడర్ లో జోష్ నింపటంతో పాటుగా.. పార్టీ శ్రేణులన్నీ ఎన్నికలకు సిద్దమయ్యేలా చేయటం ఈ యాత్ర లక్ష్యం. దీంతో..2024 ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలనే లక్ష్యంతో ఉన్న లోకేశ్..తన తండ్రి నియోజకవర్గం నుంచే తన యాత్ర ప్రారంభించి కొత్త సవాల్ కు సిద్దమవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+