వివేకా హత్యకేసు: జగన్ వెకిలినవ్వు; సందర్భం చెప్తే గొడ్డలి బహుమతి: క్లూ ఇచ్చిన లోకేష్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయట పడుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా ఎందుకు అరెస్ట్ చెయ్యటం లేదని ప్రశ్నిస్తున్నారు. జగన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పదేపదే ఈ హత్యకేసులో జగన్ ప్రమేయం ఉందని చెప్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ హత్యకేసుపై ఎందుకు స్పందించడం లేదు?
ఈ నేపధ్యంలో తాజాగా మరో మరో జగన్ ని టార్గెట్ చేసిన నారా లోకేష్ విశాఖ కోర్టుకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ హత్యకేసుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో చంపిన వాళ్ళని ఎందుకు కనిపెట్టడం లేదని ప్రశ్నించారు. సిబిఐపై పోలీసులు కేసులు పెట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సునీత రెడ్డి ఈ హత్య వెనుక ఎవరెవరున్నారో చెప్పారు
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈ హత్య వెనుక ఎవరెవరున్నారో చెప్పారని లోకేష్ పేర్కొన్నారు. అయినా వారిని అరెస్ట్ చెయ్యలేకపోవటం వెనుక కారణం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. 2019లో చంద్రబాబు చంపారని ఆరోపణలు చేసిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని ప్రశ్నించారు. నాడు అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పి ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నారని మండిపడ్డారు.

జగన్ ఫోటో పోస్ట్ చేసి లోకేష్ ప్రశ్న .. చెప్పినవారికి గొడ్డలి బహుమతి
ఇక ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి హత్య రోజున పులివెందులకు వెళుతున్న ఒక ఫోటో ని ట్వీట్ చేసి ఆ వెకిలి నవ్వు.. ఆ వెకిలి చేష్టలు ..సందర్భం ఏమిటో చెప్పగలరా? చెప్పినవారికి గొడ్డలి బహుమతిగా ఇవ్వబడును అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు క్లూ మార్చి 16 2019 పులివెందుల అంటూ అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.

బాబాయ్ ని లేపేసి ఆస్కార్ రేంజ్ లో అబ్బాయిల యాక్టింగ్
అంతకుముందు బాబాయ్ ని లేపేసి ఆస్కార్ రేంజ్ లో అబ్బాయిల యాక్టింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. మొత్తానికి వైఎస్ వివేకా హత్యకేసులో ఉంది వైఎస్ కుటుంబమే అని లోకేష్ పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వివేకా హత్యకేసులో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారనే అనుమానం ఉందని పేర్కొన్న సీబీఐ ఆ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో టిడిపి నేతలు మరోమారు వైయస్ జగన్ ను, ఎంపీ అవినాష్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications