చంద్రబాబు అరెస్టుకు రెండేళ్లు.. ! లోకేష్ భావోద్వేగం..!
ఏపీలో సీఎం చంద్రబాబును గత వైసీపీ ప్రభుత్వం స్కిల్ స్కాంలో అరెస్టు చేసి ఇవాళ్టికి సరిగ్గా రెండేళ్లు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి రిమాండ్ పై రాజమండ్రి జైలుకు చంద్రబాబును పంపడం, ఆ తర్వాత 53 రోజులు జైల్లోనే ఉండి ఆయన విడుదల కావడం జరిగాయి. అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమిని ప్రజలు భారీ మెజార్టీతో గద్దెనెక్కించి కూడా ఏడాది దాటిపోయింది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి రెండేళ్లు పూర్తయిన క్షణాల్ని గుర్తుచేసుకుంటూ ఆయన కుమారుడు, ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో కుర్చీలో కూర్చొన్న ఫొటోను జత చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన అప్పట్లో తన కుటుంబం, రాష్ట్రం ఎలాంటి క్షోభ అనుభవించిందో పంచుకున్నారు.

రెండు సంవత్సరాల క్రితం ఈ రోజున తన తండ్రి చంద్రబాబు అన్యాయంగా అరెస్టు చేయబడ్డారని లోకేష్ తెలిపారు. ఈ సంఘటన తన కుటుంబానికి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందన్నారు. ఆ క్షణం యొక్క బాధ అలాగే ఉందన్నారు. తన సంకల్పం కూడా అలాగే ఉందన్నారు. ఆయన ధైర్యం, గౌరవం , ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అచంచల విశ్వాసం న్యాయం , సత్యం కోసం తన పోరాటానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని లోకేష్ ఈ ట్వీట్ ను ముగించారు.
#2YearSinceCBNsIllegalArrest
— Lokesh Nara (@naralokesh) September 9, 2025
Two years ago, on this day, my father Shri @ncbn garu was unjustly arrested. This event marked a dark chapter not just for our family, but for democracy itself. The pain of that moment remains, but so does our resolve. His courage, dignity, and… pic.twitter.com/Zi3QtdFcBI
అప్పట్లో చంద్రబాబు అరెస్టుతో లోకేష్ స్వయంగా రోడ్లపైకి వచ్చారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసి తన తండ్రికి మద్దతు కూడగట్టారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కూడా లభించడంతో కూటమి ఏర్పాటు చేయడం, ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు అరెస్టుపై వివరించి ఓట్లు అడగడం జరిగాయి. దీంతో ప్రజలు కూడా చంద్రబాబుపై సానుభూతి వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో ఘన విజయం కట్టబెట్టారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..!












Click it and Unblock the Notifications