TDP MAHANADU 2025: మహానాడులో లోకేష్ 6 శాసనాల ప్రకటన-ఏంటో తెలుసా ?
ఏపీలో తొలిసారి టీడీపీ మహానాడు కడప జిల్లాలో జరుగుతోంది. ఇందులో టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు ఆరంభ ఉపన్యాసం చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ తరఫున ఆరు శాసనాలను విడుదల చేశారు. వీటిపై చర్చించి మహానాడు చివరి రోజు ఆమోదించబోతున్నారు. వీటిలో పలు కీలక అంశాలున్నాయి.
టీడీపీ అంటేనే పేదల పార్టీ అని నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా 6 శాసనాలను ఆయన ప్రతిపాదించారు. ఇందులో మొదటిది తెలుగుజాతి విశ్వఖ్యాతి, రెండవది యువగళం, మూడవది స్త్రీ శక్తి. నాలుగవది పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ . ఐదవది అన్నదాతకు అండగా, ఆరవది కార్యకర్తే అధినేత. ఈ ఆరు శాసనాలపై ఇవాళ, రేపు చర్చిస్తారు. అనంతరం వీటిని ఆమోదిస్తూ చివర్లో ఓ తీర్మానం చేస్తారు.

తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమాజంలో మహిళలను చులకనగా చూసే పరిస్థితి మారిపోవాలన్నారు. తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. తమకు అధికారం కొత్త కాదని, ప్రతిపక్షం కొత్త కాదని కార్యకర్తలకు తెలిపారు. అయితే మారుతున్న కాలానికి తగినట్లుగా పార్టీ కూడా మారాలన్నారు. 58 మంది మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని విద్యామంత్రి లోకేష్ తెలిపారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యమని లోకేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications