నేనంత కుసంస్కారిని కాదు.. వాస్తవాలను కాలమే ప్రజల ముందుంచుతుంది: పవన్ పై లోకేష్
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మీడియాను, టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనుక నుంచి విరిచే ప్రయత్నం చేస్తున్నారని పవన్ తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.
Recommended Video


పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. (1/2)
— Lokesh Nara (@naralokesh) April 20, 2018
ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ పవన్ ఆరోపణలపై స్పందించారు. 'పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నాపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు.' అని ట్విట్టర్ ద్వారా స్పందించారు లోకేష్.
వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ. (2/2)
— Lokesh Nara (@naralokesh) April 20, 2018
అంతేకాదు, 'వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ.' అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ తాజా కామెంట్లపై పవన్ స్పందిస్తారా? అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.












Click it and Unblock the Notifications