వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు నెలల పాలనకే ఇంత ప్రజా వ్యతిరేకతా: జగన్ పాలనపై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రానికి నష్టం తప్ప లాభం లేదని ఇప్పటికే టిడిపి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలో రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు జగన్ మూడు నెలల పాలన చాలా దరిద్రపు పాలన అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాహాటంగానే తిట్టిపోస్తున్నారు. మహిళలు తిడుతున్న తీరు చూస్తే తనకే తల కొట్టేసినట్టు ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు .

జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడడం మానుకోవాలన్న నారా లోకేష్

జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడడం మానుకోవాలన్న నారా లోకేష్

ఇప్పుడు జగన్ సర్కార్ తీరుతో రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని లోకేష్ విమర్శలు గుప్పించారు. మూడు నెలల పాలనలో కూల్చివేతలు, దాడులు, అభివృద్ధి కార్యక్రమాల నిలిపివేత తప్ప మరేం చెయ్యలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో మిగతా రంగాలతో పోలిస్తే మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తోందంటూ మీడియాలో కథనాలు రావడం పట్ల లోకేశ్ చాలా ఘాటుగా స్పందించారు . సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పిన జగన్ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా అత్యధిక ఆదాయం రావటం అంటే ఇదేనా మద్యపాన నిషేధం అని ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. ఇకపై జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు .

జనం మెలకువతో ఉంటే ఏంటీ దరిద్రపు పాలన అని ప్రశ్నిస్తారనా ఈ స్కెచ్ అన్న నారా లోకేష్

జనం మెలకువతో ఉంటే ఏంటీ దరిద్రపు పాలన అని ప్రశ్నిస్తారనా ఈ స్కెచ్ అన్న నారా లోకేష్

సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి ఈ విధంగా మద్యం రాబడిని పెంచుకోవడం ఏంటని లోకేష్ నిలదీశారు . గతేడాదితో పోలిస్తే, ఏప్రిల్ నుంచి జూలై వరకు మద్యంపై ఆదాయంలో 14.5 శాతం పెరుగుదల నమోదైందని, ఏ రంగంలోనూ ఆదాయం రాబట్టలేని ఏపీ సర్కారు మద్యం అమ్మకాల్లో మాత్రం పురోగతి సాధించిందని వ్యంగ్యం ప్రదర్శించారు లోకేష్ . జనం ఎప్పుడూ మత్తులోనే ఉండాలని , జనం మెలకువతో ఉంటే తన పాలనలోని డొల్లతనం బయటపడుతుందని ఈ స్కెచ్ వేశారా ఏంటి? అంటూ లోకేశ్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.

మా హయాంలో అవార్డులు అందుకున్నాం.. మీ పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకతా? అన్న లోకేష్

మా హయాంలో అవార్డులు అందుకున్నాం.. మీ పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకతా? అన్న లోకేష్

జగన్ గారూ.. ఈ మహిళ మాటలు విన్నారా ? ఒకవేళ వింటే ఎలా భరిస్తున్నారండి ఇంత అవమానం? నాకైతే తల కొట్టేసినట్లనిపించింది అంటూ ఒక వీడియో ను పోస్ట్ చేసిన లోకేష్ మూడు నెలల కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకతా అంటూ జగన్ ను ప్రశ్నించారు. తాము పనిచేసిన కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి పాలన సాగించినందుకు అంతర్జాతీయ స్థాయిలో మా ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయి అని చెప్పిన నారా లోకేష్ నిండా 3 నెలల పాలనకే మీపై ఇంత ప్రజా వ్యతిరేకతా? అంటూ జగన్ ను ఎద్దేవా చేశారు.

English summary
The TDP has already said that since the YCP came to power in AP, the state has no profit except loss. TDP National Secretary General Nara Lokesh boasts that the three-month rule is very poor. Lokesh has said that the way women are angry on jagan with in three months rule .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X