జబర్దస్త్ బిల్డప్ బాబాయి; సీఎం జగన్ పై నారా లోకేష్ సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించి ప్రజల మద్దతు పొందే యత్నం చేస్తున్నారు. అంతేకాదు ఏపీలో ప్రభుత్వ అసమర్ధ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సోషల్ మీడియా వేదికగా జగన్ పై సెటైర్లు వేశారు.
అయ్యో...జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా నిర్మించలేదా? అంటూ పేర్కొన్న నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారు అంటూ టార్గెట్ చేశారు . ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు అంటూ జగన్ ను ఎద్దేవా చేశారు.

సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయింది కానీ ఇప్పటివరకు అతీగతీ లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రూ.15వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పాతికవేలమందికి ఉద్యోగాలిస్తానంటూ ఆనాడు కోతలు కోశాడు. కానీ ఈ రోజుకీ పూర్తి చెయ్యలేకపోయాడు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైపోయిందని పేర్కొనారు నారా లోకేష్ . దీంతో జెఎస్ డబ్ల్యు అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడు.
మరో మూడునెలల్లో పదవీకాలం పూర్తికావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదు అని నారా లోకేష్ జగన్ చెప్పింది చెయ్యలేడు అని చూపించే ప్రయత్నం చేశారు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపర్చి తారువేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడని జగన్ హయాంలో ఏది చేసినా ఇలాగే ఉంటుందన్నారు. ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications