జగన్ పార్టీ ఎంపీలకు ‘భాస్కర్ అవార్డులు’, ‘ఏ1, అరడజను దొంగలు’ : లోకేష్ సైటైర్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజీనామాల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలది గొప్ప నటన అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలను మభ్యపెట్టి, బీజేపీతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడటంలో గొప్ప నటన కనబర్చారని విమర్శించారు. రాజీనామా డ్రామాకు గానూ వైసీపీ ఎంపీలకు భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

nara lokesh satirical comments on ysrcp mps

అంతేగకా, వైసీపీ నేతలు వారి సొంత కథతో 'ఏ1 మరియు అరడజను దొంగలు' అనే పేరుతో సినిమా తీస్తే బాగుంటుందని ట్విట్టర్ వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది ఇలా ఉంటే, గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో ఏపీ మంత్రి లోకేష్‌ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శావల్యాపురం మండలం వేల్పూర్‌లో ... ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+