దేవాన్ష్‌పై ప్రయోగం చేశా, చంద్రబాబు ఉన్నారు: నారా లోకేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపైనే కాకుండా తన తనయుడు నారా దేవాన్షుపై కూడా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు

పాఠశాలల్లో పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి ఐఈసీ కిట్స్‌తో దేవాన్ష్‌పై ప్రయోగం చేశానని ఆయన అన్నారు.. రాష్ట్ర శాసన మండలిలో మరుగుదొడ్ల నిర్మాణం గురించి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

 దేవాన్ష్‌కు అర్థమైందన్న లోకేష్

దేవాన్ష్‌కు అర్థమైందన్న లోకేష్

పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలిపే ఐఈసి కిట్స్ చాలా బాగున్నాయని, విద్యార్థులకు ఆ మెటీరియల్ అర్ధం అవుతోందా అని కూడా పరిశీలించానని తెలిపారు. దేవాన్ష్‌కు కూడా అర్ధం అయిందని ఆయన అన్నారు.

 పిల్లల మార్పు తీసుకురావాలి...

పిల్లల మార్పు తీసుకురావాలి...

పిల్లల్లో మార్పు తీసుకురావడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. ఇప్పటికే మూడు జిల్లాలను ఓడీఎఫ్ జిల్లాలుగా ప్రకటించామని, డిసెంబర్ 15 నాటికి మరో మూడు జిల్లాలను ప్రకటిస్తామని ఆనయ చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, వాటి నిర్వహణ బాధ్యత అప్పగించే అంశం పరిశీలిస్తామని కూడా చెప్పారు.

 చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్...

చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్...

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు భారీగా ఉన్నాయని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో అలాంటి మౌలిక సదుపాయాలేవీ లేకపోయినా బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు నాయుడు ఒక్కడున్నారు చాలునని లోకేశ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (ఎపిటా) నిర్వహించిన భారీ జాబ్‌మేళా ముగింపు సమావేశంలో ఆ మాటలన్నారు.

 వచ్చే మార్చినాటికి పదివేల ఉద్యోగాలు

వచ్చే మార్చినాటికి పదివేల ఉద్యోగాలు

వచ్చే ఏడాది మార్చినాటికి మరో 10,000 ఉద్యోగాలను యవతకు కల్పించాలని ‘ఎపిటా'ను ఆదేశించినట్లు నారా లోకేష్ చెప్పారు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఎవరూ ఖాళీగా ఉండొద్దని అభిప్రాయపడ్డారు. ముందుగా వచ్చిన ఉద్యోగంలో చేరి, ఆ తరువాత లక్ష్యసాధన దిశగా ఉన్నత స్థాయి కోసం కృషి చేయాలని ఆయన యువతకు సూచించారు.

మూడేళ్లలోనే ఇన్ని కంపెనీలు వచ్చాయి...

మూడేళ్లలోనే ఇన్ని కంపెనీలు వచ్చాయి...

మూడున్నరేళ్లలోనే రాష్ట్రానికి 194 కంపెనీలు వచ్చాయని, 12,985 ఉద్యోగాలు లభించాయని నారా లోకేష్ చెప్పారు. శ్రీసిటీలో ఫాక్స్‌కాన్‌ ఫోన్ల తయారీ కంపెనీ వచ్చిందని, 13,000 మంది మహిళలకు ఈ కంపెనీలో ఉపాధి లభించిందని ఆయన చెప్పారు. మరో రెండు ఫోన్ల తయారీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విజయవాడకు ‘హెచ్‌సీఎల్‌', విశాఖకు ‘కాంటినెంటల్‌' వస్తున్నట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh IT minister Nara Lokesh said that experiment has been done on his son Devanshu with IES kits.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి