డబ్బు తిరిగి అడుగుతారనే...: జగన్‌పై నారా లోకేష్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రావడం లేదని, పలువురి దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి అడుగుతారనే భయమే దానికి కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఆ సార్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక కుటుంబ వ్యాపారంలా మారిపోయిందని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావం పేరుతో వైయస్ జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటనను ముగించుకుని నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఆ వ్యాఖ్యలు చేశారు.

నారా లోకేష్ ట్విట్టర్‌లో చాలా చురుగ్గా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వ్యాఖ్యలు చేయడానికి ట్విట్టర్‌ను వేదికగా మార్చుకున్నారు.
జగన్‌కు యువత మద్దతు లభిస్తోందనే నేపథ్యంలో వారి మనసు మార్చడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ఇటీవల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. యువతకు సదస్సులు నిర్వహిస్తున్నారు. యువతకు మార్గదర్శనం చేసేందుకు ఆయన సదస్సులను వేదికలుగా మార్చుకుంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications