Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై లోకేశ్ దిగ్బ్రాంతి, ఆళ్లనాని, సుచరిత కూడా.. 15 రోజుల్లో రెండో ప్రమాదం

విశాఖపట్టణం పరవాడలో గల రాంకీ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన పేలుడుతో సీనియర్ కెమిస్ట్ కాండ్రేగుల శ్రీనివాసరావు మృతిచెందారు. సోమవారం రాత్రి ఆయన డ్యూటీకి వెళ్లారని, ప్రమాదం తర్వాత కనిపించలేదు. శిథిలాల మధ్య అతని మృతదేహాన్ని గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ మల్లేశ్ గాజువాక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో నలుగురు ఉన్నారని యజమాన్యం చెబుతుండగా.. 15 మంది వరకు ఉన్నారని అనుమానం వ్యక్తమవుతోంది.

 లోకేశ్ దిగ్బ్రాంతి

లోకేశ్ దిగ్బ్రాంతి

ఫార్మాసిటీ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరస ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మరీ పరావడ రాంకీ ప్రమాదానికి బాధ్యులు ఎవరు అని లోకేశ్ ప్రశ్నించారు. 15 రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయని.. సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

 ఆళ్ల నాని దిగ్బ్రాంతి

ఆళ్ల నాని దిగ్బ్రాంతి

ఫార్మాసిటీ ప్రమాదం డిప్యూటీ సీఎం ఆళ్ల నాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందజేయాలని జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేస్తామని తెలిపారు.

 సుచరిత దిగ్బ్రాంతి

సుచరిత దిగ్బ్రాంతి

ప్రమాదంపై హోంమంత్రి మేకతోటి సుచరిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గాయపడ్డ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.

భగ్గుమన్న కార్మిక సంఘాలు

భగ్గుమన్న కార్మిక సంఘాలు


పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. కంపెనీ వద్ద ఆందోళన చేపట్టేందుకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలు అమలు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా రాంకీ ఫార్మా పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా రహదారులను పోలీసులు మూసివేశారు. ఆ సమీపంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+