మొనగాడు జగన్ వచ్చి.. చేస్తున్నారట!: ‘ఫేక్’ బతుకంటూ నారా లోకేష్ తీవ్ర విమర్శలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులపై ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సాక్షి పత్రిక మరోసారి అబద్ధాలు వండివార్చిందంటూ ఆ పత్రికపైనా మండిపడ్డారు. అమరావతి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినేవాడుంటే..

వినేవాడుంటే..

‘చంద్రబాబుగారి హయాంలో కృష్ణపట్నం పోర్టుకి విశేష అధికారాలు కట్టబెట్టారట. మొనగాడు జగన్ వచ్చి ముఖ పరిధిని తగ్గించి రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తున్నారట. వినేవాడు ఉంటే జగన్ గారు ఎవరి చెవిలో అయినా పువ్వు పెట్టగలిగే సమర్థుడు' లోకేష్ ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలోనే జగన్ చెప్పారు.. మరో దొంగ వార్త..

‘దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షి ఛానల్, పేపర్ లో రాసే వార్తలు అన్నీ తప్పే అని వైఎస్ జగన్ గారు స్వయంగా శాసనసభలో ప్రకటించారు. ఇప్పుడు మరోసారి దొంగ వార్త వండి వార్చారు' అని లోకేష్ మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ట్వీట్ చేశారాయన.

ఫేక్ బతుకంటూ ఘాటుగా..

‘వైఎస్ జగన్ గారు వేసే ముష్టి పేటీఎం 5 రూపాయిల కోసం ఎంతకైనా దిగజారుతారు వైకాపా పేటీఎం బ్యాచ్. వారి అధ్యక్షుడిదే ఫేక్ బతుకు అయినప్పుడు, పాపం వీరి జీవితాల్లో మార్పు ఎలా వస్తుంది?' అంటూ ఘాటుగా విమర్శించారు లోకేష్.

రోడ్లపైకి మహిళలంటూ..

‘మహిళలు అని కూడా చూడకుండా వారి కష్టార్జితాన్ని లాక్కొని రోడ్డు మీద నిలబెడుతున్నారు. వైకాపా మంత్రులు, ప్రజా ప్రతినిధుల భూ దాహానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

జగన్ సైలెంట్‌గా..

‘వైఎస్ జగన్ గారు సైలెంట్ గా విశాఖ భూములు కాజేస్తే మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటున్నారు వైకాపా మంత్రులు. ఒక అడుగు ముందుకేసి వైలెంట్ గా పేదప్రజల భూములు లాక్కుంటున్నారు. మొన్న బొత్స, నిన్న ఆదిమూలపు కుటుంబసభ్యులే నేరుగా ప్రజలపై పడి భూకబ్జాలకు పాల్పడుతున్నారు' అని లోకేష్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+