Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిరుద్యోగులు ఉరేసుకునే పరిస్థితి ; జగన్ రెడ్డి సూసైడ్ చేసుకున్న కమల్ ను తీసుకురాగలరా : లోకేష్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ రెడ్డి రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిరుద్యోగుల సమస్యలను జగన్ రెడ్డి పట్టించుకోవడంలేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఆత్మహత్యల బాట పడుతున్నా సీఎం జగన్ లో స్పందన లేదని పలుమార్లు విమర్శించిన నారా లోకేష్ తాజాగా మరోమారు జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.

నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి కమల్ కు లోకేష్ నివాళులు

నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి కమల్ కు లోకేష్ నివాళులు

ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించిన లోకేష్, నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు కమల్ కు నివాళులర్పించారు. తాను పరామర్శకు వస్తుంటే వైసిపి నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు లోకేష్. తన పర్యటన నేపథ్యంలో కమల్ కుటుంబాన్ని తనకు కలవకుండా వైసీపీ నాయకులు మాయం చేశారని విమర్శించారు. రాత్రి వరకు తమ కుటుంబానికి కలిగిన నష్టం ఇంకెవరికి కలగకూడదని, ఇంకో కుర్రాడు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదని బాధ పడిన కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చేయడం దారుణమని లోకేష్ ఆరోపించారు. కమల్ కుటుంబాన్ని మాయం చేసిన వైసిపి నాయకులు చనిపోయిన కమల్ ను తిరిగి తీసుకు రాగలరా అంటూ ప్రశ్నించారు లోకేష్ .

అన్ని నిజాలు బయటపడతాయనే వైసీపీ నాయకుల భయం

అన్ని నిజాలు బయటపడతాయనే వైసీపీ నాయకుల భయం

తాను పరామర్శకు వస్తే అన్ని నిజాలు బయటపడతాయని వైసిపి నాయకులు భయపడుతున్న కారణంగానే ఈ విధంగా చేశారని ఆరోపించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇంటర్నేషనల్ యూత్ డే జరుపుకుంటే మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకుల కుటుంబాలను పరామర్శించాల్సిన పరిస్థితి యూత్ డే రోజు రావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు చెప్పుకుందాం అంటే వినే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. యువత సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.

 ఫ్యానుకు ఓటేసి గెలిపిస్తే అదే ఫ్యానుకు నిరుద్యోగులు ఉరేసుకునే పరిస్థితి

ఫ్యానుకు ఓటేసి గెలిపిస్తే అదే ఫ్యానుకు నిరుద్యోగులు ఉరేసుకునే పరిస్థితి

నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతోందని, నిరుద్యోగ యువకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని లోకేష్ వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఫ్యాను గిర్రున తిప్పి 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని జగన్ రెడ్డి చెప్పారని ఎద్దేవా చేశారు. కానీ అదే ఫ్యానుకు నిరుద్యోగులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారని
లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు నిరుద్యోగుల ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

 యువకులను బలి తీసుకుంటున్న ఫేక్ రెడ్డి ఫేక్ క్యాలెండర్

యువకులను బలి తీసుకుంటున్న ఫేక్ రెడ్డి ఫేక్ క్యాలెండర్

ఫేక్ రెడ్డి రిలీజ్ చేసిన ఫేక్ క్యాలెండర్ యువకులను బలి తీసుకుంటుంది అని ఆరోపించిన లోకేష్ ఇప్పటికైనా ఫేక్ క్యాలెండర్ ను రద్దుచేసి 2.1 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని లోకేష్ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువ ముఖ్యమంత్రి అని ఆశపడిన యువతకు బతుకు లేకుండా చేస్తున్నారు జగన్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఉద్యోగాలు లేక బతుకు మీద భయంతో యువత ఆత్మహత్యలు

ఉద్యోగాలు లేక బతుకు మీద భయంతో యువత ఆత్మహత్యలు

మాస్కు పెట్టుకోలేదని ఒకరిని, దొంగతనం ఒప్పుకోలేదని ఒకరిని, జగన్ రెడ్డిని ప్రశ్నించారని ఒకరిని ఈ ప్రభుత్వం బలితీసుకుంది అన్న లోకేష్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే తట్టుకోలేని యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నదంటూ నిప్పులు చెరిగారు. ఉద్యోగాలు లేక బతుకు మీద భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువశక్తిని రెండేళ్ల వైయస్ జగన్ పాలన తీవ్రంగా నిరుత్సాహపరిచింది అని పేర్కొన్న లోకేష్ జగన్ రెడ్డి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని లోకేష్ పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+