ఏపీ సీఎం వైఎస్ జగన్ కు భాస్కర్ అవార్డ్!!

గులకరాయి ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్‌కు బదులు భాస్కర్‌ అవార్డు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వడంలేదని రైతులు లోకేశ్ దృష్టికి తెచ్చారు. రాజధాని గ్రామాల్లోని పేదలకు ఇచ్చే పింఛను డబ్బులు కూడా సకాలంలో రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో పేదలకు ఇచ్చే రూ.5 వేల పింఛన్‌ను కొనసాగిస్తామని, అసైన్డ్‌ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో సహా చెల్లిచడం జరుగుతుందన్నారు. మూడు నెలల వ్యవధిలోనే రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామన్నారు. రాజధానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, అందుకు తగినట్లుగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన కూడా జరుగుతుందన్నారు. పనులన్నీ శరవేగంగా జరుగుతాయని, ఇవి జరగడంవల్ల సంపద వృద్ధి చెందుతుందని, రూపాయిని సృష్టించగలిగితేనే అందరూ సంతోషంగా ఉంటారన్నారు.

nara lokesh speech in mangalagiri election campaign

గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన లోకేశ్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా అక్కడినుంచే గెలిచితీరాలనే ఉద్దేశంతో ఉన్న లోకేష్ ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్ కు ప్రత్యర్థిగా మురుగుడు లావణ్య ఉన్నారు. ముందుగా గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారుకానీ తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను మార్చి లావణ్యను అభ్యర్థిగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+