ఎమ్మెల్సీగా.. నారా లోకేష్ తడబాటు: మెట్టు వద్ద కాలుజారిపడ్డారు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కొంత తడబడ్డారు. మండలి చైర్మన్ చక్రపాణి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పలువురు సభ్యులతో ప్రమాణం చేయించారు.

ఈ సమయంలో లోకేష్ కూడా ప్రమాణం చేశారు. లోకేష్ కొన్ని పదాలు ఉచ్చరించడంలో ఇబ్బంది పడ్డారు. మధ్యమధ్యలో పదాలు మింగేసినట్లుగా కనిపించింది. పదాలను ఉచ్చరించలేక ఇబ్బంది పడుతున్న సమయంలో పక్కనున్న వారు అందించే ప్రయత్నం చేశారు.

చట్టసభలోకి తొలిసారిగా: ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారం

Nara Lokesh takes oath as MLC in Amaravati

లోకేష్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. సార్వభౌమాధికారాన్ని అనే పదం చదివేందుకు తడబడ్డారు. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వర్తిస్తానని చెప్పేందుకు కూడా ఇబ్బంది పడ్డారు.

ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు అంతకుముందు గుంటూరు టిడిపి కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. నారా లోకేష్ అక్కడకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ.. ఓ మెట్టు వద్ద కాలు జారి పడబోయారు. పక్కనే ఉన్న అనుచరులు ఆయనను పట్టుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party general secretary Nara Lokesh on Thursday took oath as Member of a Legislative Council in Amaravati along with other members. Nara Lokesh sworn-in with the help of Legislative Council chairman Chakrapani.
Please Wait while comments are loading...