మీ రుణం తీర్చుకోలేను - లోకేష్ ఎమోషనల్..!!

తెలుగుదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో కొత్త రికార్డు నెలకొల్పింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ఒక పండగలా నిర్వహించారు. ఊరూవాడా జై టిడిపి నినాదాలతో హోరెత్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లో నూ టీడీపీ సభ్యత్వానికి మంచి స్పందన కనిపించింది. టీడీపీ సాధించిన ఈ అరుదైన ఘనతకు కారణమైన కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాసారు. టీడీపీలో కార్యకర్తే అధినేత అంటూ కీర్తించారు. కేడర్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

కొత్త రికార్డు
టీడీపీ కోటి మంది సభ్యత్వం పూర్తి చేసుకుంది. ఈ సమయాని పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో నారా లోకేష్ పలు అంశాలను ప్రస్తావించారు. నాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారిందని పేర్కొన్నారు. పార్టీలో సభ్యులుగా చేరిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ఒక పండగలా నిర్వహిస్తూ.. ఊరూవాడా జై టిడిపి నినాదాలతో హోరెత్తించారని చెప్పుకొచ్చారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ లు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారని లోకేష్ వివరించారు.

Nara Lokesh thanked the party activists in making the membership drive a massive success

ప్రాణం కంటే పార్టీ కోసం
గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించామంటూ లోకేష్ తన సంతోషాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం, బలగంగా చెప్పిన లోకేష్..పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్ అంటూ జోష్ పెంచారు. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టిడిపి అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య తనకు ప్రతి క్షణం గుర్తొస్తారని లోకేష్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధులు ఉన్మాదుల్లా మీద పడు తుంటే మీసం మెలేసి, తొడకొట్టి జై చంద్రబాబు అన్న అంజిరెడ్డి తాత తెగువ తనకు నిత్యస్ఫూర్తి గా చెప్పుకొచ్చారు.

వారే స్పూర్తి
సార్వత్రిక ఎన్నికల్లో బూత్ ఏజెంట్ గా ఉండటానికి వీలు లేదని ప్రత్యర్థి మూకలు గొడ్డలి వేటు వేసినా రక్తపు గాయాలతోనే పోలింగ్ బూత్ లో కూర్చొని రిగ్గింగ్ అడ్డుకున్న ఉక్కు మహిళ మంజుల గారి ధైర్యం గురించి గుర్తుచేసుకున్న ప్రతిసారి తనకు గర్వంగా ఉంటుందన్నారు. ప్రాణం ఎక్కు వా? పార్టీ ఎక్కువా? అంటే పార్టీనే ఎక్కువ అని జైకొట్టే చేతులు అనేకం ఉన్నాయన్నారు. ఏమి ఇచ్చినా, ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని లోకేష్ ఎమోషనల్ అయ్యారు. దేశం లో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టిడిపి కి మాత్రమే సొంతం. అలానే ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తుందని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం మాత్రమేనని లోకేష్ పేర్కొన్నారు.

కార్యకర్తల సంక్షేమం కోసం
కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పవిత్రమైన బాధ్యత చంద్రబాబు తనకు అప్పగించా రని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం అందించామని చెప్పారు. ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయలు చొప్పున రూ. 103 కోట్ల 28 లక్షల రూపాయలు అందజేసినట్లు వెల్లడించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి రూ. 19 కోట్లు ఆర్థిక సహాయం చేసినట్లు వివరించారు. సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు టిడిపి కార్యకర్తల సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు. ప్రమాద బీమా ప్రయోజనాన్ని రూ. 5 లక్షలకు పెంచామని చెప్పారు జెండా మోసే ప్రతి కార్యకర్త కు అండగా నిలవడమే తన ఎజెండా గా లోకేష్ వెల్లడించారు. కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలు కొట్టడంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ లేఖ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+