అమెరికాలో పోటాపోటీ! బరాక్ ఒబామాతో నారా లోకేష్, సత్య నాదెళ్లతో కేటీఆర్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఈ నెల 7వ తేదీన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసే అవకాశాలుండగా, తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మే 18న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ కానున్నారు. ఇప్పటికే నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

మంగళవారం ఆయన అమెరికాకు పయనం అవుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే దిశగా ఆయన పర్యటన ఉంటుంది. లోకేష్ లక్ష్యం కూడా పెట్టుబడులే కావడం గమనార్హం. నారా లోకేష్ అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లతోను భేటీ అవుతారు.

Nara Lokesh to meet Obama, KTR to meet Satya Nadella

కేటీఆర్ షెడ్యూల్

మే 6న వాషింగ్టన్ డీసీలో ఇండియన్ అంబాసిడర్‌తో మీటింగ్. సాయంత్రం న్యూయార్క్ ప్రయాణం.
మే 7న డీఈషా, ఇతర వ్యాపారవేత్తలతో సమావేశం. న్యూజెర్సీలో సాయంత్రం ఎన్నారైల కార్యక్రమం.
మే 8న ఫిట్స్ బర్గ్‌కు పయనం. మెలాన్ వర్సిటీ ఫ్యాకల్టీ, సీఈవోతో భేటీ.
మే 9న డల్లాస్‌కు పయనం. వ్యాపారవేత్తలతో బ్రేక్ ఫాస్ట్, లంచ్. సాయంత్రం ఎన్నారైలతో భేటీ
మే 10 శాన్ ఫ్రాన్సిస్కో పయనం.
మే 11న పాలో ఆల్టోలో జరిగే మేకిన్ ఇండియా కార్యక్రమంలో స్పీచ్. గూగుల్ ప్రతినిధులతో భేటీ.
మే 12న సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్, వ్యాపారవేత్తలతో భేటీ.
మే 13 స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సందర్శన
మే 14 ఫిక్కీ ఇంటరాక్టిల్ సెషన్
మే 15న టైకాన్ కాన్ఫరెన్స్‌కు హాజరు. కార్పోరేషన్ సీఈవో జాన్ ఛాంబర్సుతో భేటీ
మే 16న టెలికాం - నెట్ వర్క్ కంపెనీతో భేటీ, సాయంత్రం ఎన్నారైలతో సమావేశం.
మే 18న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+