గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది(ఫోటోలు)

అమరావతి: విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు విద్యార్ధుల్లో ఒకింత కలకలం రేపాయి. విషయం ఏంటంటే బుధవారం దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యాంటీ ర్యాగింగ్ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన నారా లోకేష్ విద్యార్ధులతో మాట్లాడుతూ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన తనకే గూగుల్‌లో ఉద్యోగం రాలేదని, మీకెలా వస్తుందంటూ వ్యాఖ్యానించారని సమాచారం. చాలా మంది కార్యకర్తలు తమ పిల్లలకు గూగుల్‌లో ఉద్యోగానికి సిఫార్సు చేయాలంటూ తనవద్దకు వస్తున్నారని, తనకే రానప్పుడు వారికెలా వస్తుందని చెప్పి తిరిగి పంపించి వేస్తున్నట్లు లోకేష్ పేర్కొనడం చర్చనీయాంశమైంది.

దీనిపై విద్యార్ధుల తల్లిదండ్రులు కార్యకర్తల బిడ్డల్ని ప్రోత్సహించాల్సిన లోకేష్ మాట్లాడాలి గానీ, ఇలా నీరుగార్చేలా మాట్లాడటం సరికాదంటున్నారు. బాగా చదివితే గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం కష్టమేమీ కాదని, స్టాన్‌ఫర్డ్‌లో చదవితేనే అందులో ఉద్యోగాలు వస్తాయా? అంటూ విద్యార్థులు ప్రశ్నించారంట.

గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

కాగా, నాగార్జున యూనివర్సిటీలో ర్యాంగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ దంపతులు నారా లోకేష్‌ను కలిశారు. రిషితేశ్వరి మరణానికి కారణమైన వారు ఏ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

 గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

విజయవాడలోని కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నారా లోకేష్ ప్రసంగం ఉంటుందని చెప్పడంతో విద్యార్థులను తీసుకువచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకు లోకేష్ రాకపోవడంతో వారిని వెనక్కి తీసుకువెళ్లిపోయారు. దీంతో లోకేష్ మాట్లాడే సమయంలో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి.

 గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

ఈ సమావేశాన్ని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడంతో ఫ్యాన్ల సౌకర్యం సరిగా లేక ఉక్కపోతతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. లోకేష్ ప్రసంగిస్తుండగానే పశ్చిమగోదావరి జిల్లా టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత పత్తిపాటి ధర్మేంద్ర స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతడికి ప్రథమ చికిత్స చేశారు.

 గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

తెలుగుదేశం పార్టా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలిసారిగా పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు. బుధవారమే ఆయన కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులు అవడంతో పార్టీ కార్యకర్తలు ఆయనను అభినందనలతో ముంచెత్తారు.

 గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

గూగుల్‌లో ఉద్యోగంపై నారా లోకేష్ ఇలా: నాకే రాలేదు.. మీకెలా వస్తుంది

కృష్ణా జిల్లా టీడీపీ కార్యలయంగా కొనసాగిన భవనాన్నే తాత్కాలికంగా రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. ఇందులోనే ఒక గదిని లోకేష్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. తొలిసారిగా తన కార్యాలయంలో అడుగుపెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+