భార్య, కుమారుడితో కలిసి స్వగ్రామానికి వచ్చిన నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడకు రావడం విశేషం. అంతేకాదు.. ఈనెల 17వ తేదీ వరకు ఇక్కడే ఉండబోతున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంక్రాంతికి నారా, నందమూరి కుటుంబాలు ఇక్కడకు వచ్చేవి. అందరూ కలిసి సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకునేవారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నారావారిపల్లెకు చేరుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేసేవారు.

ఎన్నికల్లో ఓటమిపాలవడంతోపాటు కరోనా వల్ల కూడా బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఈ కుటుంబాలు కలవలేదు. ఆకస్మికంగా లోకేష్ ఇక్కడకు రావాలనుకోవడం చర్చనీయాంశమైంది. జనవరిలో కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. తండ్రితో సంబంధం లేకుండా భార్య, కుమారుడితో కలిసి ఒక వారంరోజులు ఇక్కడ ఉండాలనుకోవడం మంచి విషయమేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

nara lokesh visit their village naravaripalle with his wife and son

జనవరి 27వ తేదీన తన తండ్రి చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్న నారా లోకేష్. 4వేల కిలోమీటర్లు నడవాలనేది ప్రణాళిక. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా పాటల రూపకల్పన జరుగుతోంది. చంద్రబాబు మీకోసం పాదయాత్రలో ఉపయోగించినట్లుగానే లోకేష్ పాదయాత్రలో కూడా పాటలు వినియోగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+