వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ... చూస్తూ ఊరుకోం : నారా లోకేష్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విద్యార్థుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనాలోచితంగా ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి వేళ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడాలనుకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు టీడీపీ నేత నారా లోకేష్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు- విద్యా సంవత్సరం వృధా అన్న అంశంపై విద్యార్థులు, విద్యావేత్తలతో వర్చువల్ పద్ధతిలో ముఖాముఖి నిర్వహించారు.

భారత్ లో కరోనా కేసుల తగ్గుదల .. 9 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు !!భారత్ లో కరోనా కేసుల తగ్గుదల .. 9 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు !!

ఈ కార్యక్రమంలో లోకేష్ విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి వేళ పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కార్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసిన లోకేష్, పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేస్తున్న ప్రకటనలు సరికావని వ్యాఖ్యానించారు.పరీక్షలు నిర్వహిస్తామని చెబుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని లోకేష్ అన్నారు.

Nara Lokesh warns ysrcp govt to dont play with students lives

కావాలంటే ఆన్లైన్ పద్ధతిలో పరీక్షల నిర్వహణ అంశంపై ఆలోచించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల విషయంలో ఎన్నిసార్లు టిడిపి తమ అభిప్రాయాన్ని చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అంటూ లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు కోవిడ్ విజృంభణ అధికంగా ఉన్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహించటం సరికాదంటూ పేర్కొన్నారు. ఇక విద్యార్థులు సైతం ప్రభుత్వం తమ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
TDP national general secretary Nara Lokesh was outraged that the decisions taken by the AP government in the case of students were unwise. He issued warnings that his party would not sit idly by if it wanted to conduct exams in the time of a corona outbreak and play havoc with students life. Today, TDP leader Nara Lokesh conducted a virtual meeting with students and educators on the unwise decisions of the government - wasting the academic year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X