‘మంత్రి రావెలపై ఊహించని చర్యలు ఉంటాయ్’
ఆంధప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం.
అమరావతి: ఆంధప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. టీడీపీ నేతలతో, కార్యకర్తలతో రావెల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తాజాగా, పత్తిపాడు టీడీపీ నేతలు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని రావెల పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా లోకేష్‌కు వారు ఫిర్యాదు చేశారు.

కార్యకర్తల ఫిర్యాదుపై స్పందించిన లోకేష్... మరో 15 రోజుల్లో రావెలపై మీరు ఊహించని చర్యలు ఉంటాయని వారికి చెప్పినట్లు తెలిసింది. లోకేష్ స్పందనతో పార్టీ శ్రేణులు ఆనందంతో అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
