వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ పార్టీగా టీడీపీ: ప్రధాన కార్యదర్శితో పాటు లోకేశ్‌కు చంద్రబాబు అప్పగించిన పదవులివే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: గత 33 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీగా సేవలందించిన తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి జాతీయ పార్టీగా సేవలందించనుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఒక కేంద్రకమిటీ, రెండు రాష్ట్ర కమిటీలుగా ఉంటాయని తెలిపారు.

Nara Lokesh will be the tdp ex officio member

విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కమిటీలను చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు. మొత్తం 17మంది సభ్యులతో కేంద్ర పొలిట్‌ బ్యూరో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర పొలిట్‌ బ్యూరో సభ్యులుగా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నందమూరి హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి, రమేష్ రాథోడ్, ఉమామాధవ రెడ్డి, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రతిభా భారతి, నామా నాగేశ్వరరావులను నియమించారు.

ఇక పార్టీ పోలిట్ బ్యూరోలోకి ఎక్స్ అఫిషియోలుగా నారా లోకేష్‌తో పాటు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్ రమణలను నియమించారు. తన కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌కు పార్టీ కేంద్ర కమిటీలో ఉపాధ్యక్షుడి పదవిని చంద్రబాబునాయుడు అప్పగించారు. లోకేష్ రెండు రాష్ట్రాల్లో పర్యటనలు జరిపి కార్యకర్తలతో మమేకం కావాల్సి వున్నందున ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా కేంద్ర కమిటీలో ఉంచామని తెలిపారు.

కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా పి.రాములు, గరికపాటి రామ్మోహన్‌రావు, డి.కె.సత్యప్రభ, నారా లోకేశ్‌, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కొనకళ్ల నారాయణ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌.రమణ, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు.

ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇకపై జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ రాష్ట్ర విభజనతో జాతీయ పార్టీగా మారాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ 69 మందితో ఏర్పాటు కాగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ 90 మందితో ఏర్పాటైంది.

ఆంధ్రప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడు: కిమిడి కళా వెంకట్రావు.
ఉపాధ్యక్షులు: కరణం బలరాం, జేఆర్ పుష్పరాజ్, మెట్ల సత్యనారాయణ, బండారు సత్యనారాయణ, వెంకటేశ్వర చౌదరి
పార్టీ ప్రధాన కార్యదర్శులు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం, రామానాయుడు, నాగేశ్వర్ రెడ్డి, బివి జయనాగేశ్వర్‌రెడ్డి
అధికార ప్రతినిధులు: ఎం శ్రీనివాసరావు, పి అనురాధ, మల్లెల లింగారెడ్డి, జూపూడి ప్రభాకర్, వైబివి రాజేంద్రప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్, ముళ్లపూడి రేణుక
కోశాధికారి: బిసి జనార్ధనరెడ్డి.

జాతీయ ప్రధాన కార్యదర్శులు: నారా లోకేశ్‌, కొనకళ్ళ నారాయణరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి.
జాతీయ అధికార ప్రతినిధులు: పయ్యావుల కేశవ్‌, బొండా ఉమామహేశ్వరరావు, ఇ.పెద్దిరెడ్డి, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, కింజరాపు రామ్మోహన నాయుడు.
జాతీయ కోశాధికారి: సిద్ధా రాఘవరావు.

కేంద్ర కమిటీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌: ఎంఎ షరీఫ్‌,
కేంద్ర కమిటీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌: వివిఎస్‌ చౌదరి
కేంద్ర కమిటీ మీడియా కమిటీ కన్వీనర్‌: ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్‌.

English summary
Nara Lokesh will be the tdp ex officio member.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X