జగన్ హయాంలో "కంటెయినర్ లో డ్రగ్స్" - తేల్చేసారు, వాట్ నెక్స్ట్..!!

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటెయినర్ లో డ్రగ్స్ అంటూ రాజకీయంగా వివాదం చోటు చేసుకుంది. జగన్ హయాంలో రాష్ట్రానికి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయంటూ ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. వాటిని వైసీపీ తిప్పి కొట్టింది. కాగా, విశాఖ తీరానికి చేరిన ఆ కంటెయినర్ లో ఉన్న సరుకు పై సీబీఐ విచారణ చేసింది. తాజాగా నార్కోటిక్ లాబ్ అందులోని సరుకును పరీక్షించింది. మత్తు లేదని తేల్చింది. ఆ షిప్ ను విడుదల చేయాలని సీబీఐ లేఖ రాసింది. దీంతో, ఆ వివాదానికి ఇప్పుడు ముగింపు ఇచ్చారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ వివాదంగా మారిన 'విశాఖ కంటెయినర్‌ డ్రగ్స్‌' వ్యవహారంలో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది మార్చి 19న బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటెయినర్‌ డ్రగ్స్ ఉన్నాయంటూ రాజకీయంగా ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలే డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. కాగా, వైసీపీ కౌంటర్ గా బీజేపీకి సంబంధించిన నేతల కంపెనీలకు ఆ కంటైనర్ లో సరుకు వస్తుందని చెప్పుకొచ్చింది. కాగా, ఈ కంటెయినర్ పైన సుదీర్ఘ కాలం విచారణ జరిగింది. ప్రాధమికంగా విచారణ చేసిన అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే వరకూ కంటెయినర్‌ను అక్కడే ఉంచారు.

Narcotic lab clarified on Drugs container Controversy during Jagan tenure in Vizag

ఇక, కంటెయినర్‌ నుంచి సేకరించిన డ్రై ఈస్ట్‌ నమూనాలను సెంట్రల్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి పంపించారు. అయితే అందులో ఎటువంటి మత్తు పదార్థాలు(డ్రగ్స్‌) లేవని నివేదిక వచ్చిందని చెబుతున్నారు. అదే వివరాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో సమర్పించి, కేసును మూసేయాలని సీబీఐ అధికారులు కోరారు.

దానికి న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఆ కంటెయినర్‌ను సంబంధిత సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్‌ అధికారులకు 10 రోజుల క్రితం లేఖ రాశారు. నాడు కంటెయినర్ పైన వచ్చిన ఆరోపణలతో నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాలపై వచ్చి విచారణ ప్రారంభించారు. ఆ తరువాత నార్కోటిక్ లాబ్ లోనూ పరీక్షలు చేసారు. కాగా, అందులో ఎలాంటి డ్రగ్స్ లేవని నిర్దారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+