'నిన్నటిదాకా అలా, ఇప్పుడు వైయస్ జగన్‌కు నరేంద్ర మోడీ భయం'
పెద్ద నోట్ల రద్దుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడ భయం పట్టుకుందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు.
అమరావతి: రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు.
జగన్‌కు ఒకప్పుడు ఈడీ భయం పట్టుకుందని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. దేశం గర్వించ దగ్గ ప్రాజెక్టు పట్టిసీమ అన్నారు. ఏపీకి పట్టిసీమ ప్రాజెక్టు తలమానికమన్నారు. పట్టిసీమ నిర్మాణంతో రాయలసీమలో పండుగ చేసుకుంటున్నారని, రైతులకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టును కూడా జగన్ వ్యతిరేకించారన్నారు.
హోదాపై లోకేష్
ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలన్నింటిని ప్యాకేజీ ద్వారా ఇస్తామని కేంద్రం చెబుతోందని టిడిపి యువనేత నారా లోకేష్ శుక్రవారం వేరుగా అన్నారు. ప్యాకేజికి చట్టబద్ధత కల్పించాలని తాము కోరుతున్నామని చెప్పారు. కేంద్రంతో విబేధాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు.
తమ కుటుంబ ఆస్తులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామన్నారు. సింగపూర్‌లో అవినీతికి పాల్పడితే ఉరిశిక్షలు వేస్తారని అలాంటి దేశంతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నామంటూ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని విపక్షం పైన మండిపడ్డారు. ప్రపంచమే అసూయపడేలా అమరావతి నిర్మాణం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications