వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపి అనిల్ యాద‌వ్ పై అఖిలేష్ యాద‌వ్ : టిడిపి మ‌ద్ద‌తుగా: ప‌్ర‌చారంలోకి జాతీయ నేత‌లు

|
Google Oneindia TeluguNews

జాతీయ రాజ‌కీయాల్లో మిత్రులుగా ఉన్న నేత‌లు ఏపిలో టిడిపికి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగుతున్నారు. టిడి పి అధినేత‌ను ప్ర‌శంసించే నేత‌ల‌ను..త‌మ‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయించుకోవ‌ట‌నానికి టిడిపి కార్యాచ‌ర‌ణ సిద్దం చే సింది. అందులో భాగంగా ప‌ది మంది నేత‌లు ఏపికి వ‌స్తున్నారు. ఈ రోజుల నేష‌న‌ల్ కాన్ఫిరెన్స్ నేత ఫ‌రూక్ అబ్దుల్లా మైనార్టీ ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు తో క‌లిసి ప్ర‌చారం చేయ‌నున్నారు.

 టిడిపి మ‌ద్ద‌తుగా 10 మంది..

టిడిపి మ‌ద్ద‌తుగా 10 మంది..

ఏపి ఎన్నిక‌ల ప్ర‌చారంలో జాతీయ నేత‌లు. ఏపీలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదలివస్తున్నారు. దాదాపు 10 మంది అగ్రనేతలు చంద్రబాబుకు అండగా ప్రచా రంలో పాల్గొననున్నారు. రోడ్‌షోల్లోనూ, బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. దేవెగౌడ, మమతా బెనర్జీ, శరద్‌పవా ర్‌, అఖిలేష్‌ యాద వ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, అరుణ్‌శౌరి ఈ జాబితాలో ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా సోమవారం అమరావతికి వచ్చారు. ఈ రోజు అబ్దుల్లా టిడిపి అధినేత చంద్ర‌బాబు తో క‌లిసి కర్నూలుతోపాటు నంద్యాల, అవనిగడ్డ, పత్తికొండల్ల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగి స్తారు. ముస్లిం మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన ఓటర్లు ప్ర‌భావితం చేసే నియోజ‌క వ‌ర్గాల్లో ఫ‌రూక్ అబ్దుల్లా తో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌టం ద్వారా ఓట‌ర్ల‌ను ఆకట్టుకొనే ప్ర‌యత్నాలు చంద్ర‌బాబు చేస్తున్నారు.

విశాఖ‌లో మ‌మ‌తా ప్ర‌చారం..

విశాఖ‌లో మ‌మ‌తా ప్ర‌చారం..

టిడిపికి మ‌ద్ద‌తుగా ఈ నెల 28న ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ విజయవాడకు వచ్చి ప్రచారంలో పా ల్గొంటారు. ఈ నెల 31న రాష్ట్రానికి రానున్న మమతా బెనర్జీ విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా టీడీపీకి మద్దతుగా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్‌ 2న ఆయన నెల్లూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి కూడా రానున్నారు. ఇక, రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసిన అనంత రం చంద్రబాబునాయుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తారు. ఇప్ప‌టికే జాతీయ నేత‌ల షెడ్యూల్ కు అనుగు ణంగా నియోజ‌క‌వ‌ర్గాలు...ప్ర‌చార షెడ్యూల్ ఖ‌రారు చేస్తున్నారు.

ఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారు: ఆయన ఎలా గెలిచారో నాకు తెలుసు: చంద్రబాబుఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారు: ఆయన ఎలా గెలిచారో నాకు తెలుసు: చంద్రబాబు

సామాజిక వ‌ర్గాల వారీగా ప్ర‌భావం..

సామాజిక వ‌ర్గాల వారీగా ప్ర‌భావం..

జాతీయ నేత‌ల ప్ర‌చారంలోనూ టిడిపి సామాజిక వ‌ర్గాల వారీగా ప్ర‌భావం చూపించేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఫ‌రూక్ అబ్దుల్లా ను పూర్తిగా ముస్లిం మైనార్టీ వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేసారు. అ దే విధంగా అఖిలేష్ యాద‌వ్ ను వైసిపి ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాద‌వ్ పోటీ చేస్తున్న నెల్లూరు సిటీ లో ప్రచారం చేయించి..ఆ సామాజిక వ‌ర్గం పై ప్ర‌భావం చూపించాల‌ని టిడిపి భావిస్తోంది. అదే విధంగా తమిళ‌నాడు ఓట‌ర్లు నివాసం ఉండే ఏపి ప్రాంతాలైన న‌గ‌రి, సుళ్లూరు పేట వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో డిఎంకె నేత స్టాలిన్‌, విశాఖ‌లో మ‌మ‌తా బెన‌ర్జీ, విజ‌య వాడ‌లో కేజ్రీవాల్ ప‌ర్య‌టించి టిడిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నారు. అయితే, జాతీయ స్థాయి నేత‌ల తో ప్ర‌చారం ద్వారా ఏపిలో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రా లేదా అనే చ‌ర్చ మొద‌లైంది.

English summary
TDP Chief Chandra Babu invited national leaders to participate in election campaign in AP supporting TDP. Farooq Abdullah to day campaign in Muslim votes effected areas along with Chandra Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X